ఫిలిం ఛాంబర్ ఎన్నికల ఫలితాలు విడుదల.. ఏ ఏ ప్యానెల్లో ఎవరెవరు గెలిచారంటే..

ఫిలిం ఛాంబర్ ఎన్నికల ఫలితాలు విడుదల.. ఏ ఏ ప్యానెల్లో ఎవరెవరు గెలిచారంటే..

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన 'ఫిల్మ్ ఛాంబర్' ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ప్రోగ్రెస్సివ్ ప్యానెల్, మన ప్యానెళ్ల మధ్య హోరాహోరీగా సాగిన ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 2025-2027 'సంవత్సరానికి గాను  ఆదివారం (డిసెంబర్ 28) జరిగిన పోలింగ్ కు సంబంధించిన ఫలితాలు సాయంత్రం 6 గంటల తర్వాత విడుదల చేశారు. 

ప్రోగ్రెసివ్ ప్యానెల్ తరఫున డి.సురేష్ బాబు, మన ప్యానెల్ మద్దతుతో నట్టి కుమార్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తరుణంలో.. ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  వివిధ ప్యానెళ్ల గెలుపుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రొడ్యూసర్స్ సెక్టార్ :

ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి ఐదుగురు గెలుపొందారు
మన ప్యానెల్ నుంచి ఏడుగురు గెలుపొందారు

స్టూడియో సెక్టార్ లో:

మన ప్యానెల్ నుంచి ముగ్గురు 
ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఒక్కరు..

ఎగ్జిబిటర్స్ సెక్టార్ లో:

ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి 14 మంది గెలిచారు
 మన ప్యానెల్ నుంచి 2 సభ్యులు గెలుపొందారు.

డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో:

మొత్తం12 ఈసి మెంబర్స్ కు గానూ..
ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 8 మంది గెలిచారు.
మన ప్యానెల్ నుంచి 3 సభ్యులు గెలిచారు.
ఒకటి టై గా నిలిచింది. 

ఓవరాల్ గా 44 ఈసి మెంబర్స్ లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు 28  ఓట్లు, మన ప్యానెల్ కు 15 ఓట్లు వచ్చాయి. ఛాంబర్ అధ్యక్ష ఉపాధ్యక్ష సెక్రటరీ పదవులన్నీ ప్రోగ్రెసివ్ ప్యానెల్ ( బడా నిర్మాతల ప్యానల్) పరిధిలోనే‌ ఉండనున్నాయి.

►ALSO READ | తలకెక్కిన సక్సెస్: ధురంధర్’ విలన్ అక్షయ్ ఖన్నాకు లీగల్ నోటీసులు.. ‘దృశ్యం 3’ నిర్మాత సంచలన నిర్ణయం