మందు తాగకపోయినా.. ఫ్యాటీ లివర్‌ ‌‌‌‌‌‌‌! ముఖ్యంగా సాఫ్ట్వేర్ కొలువులు చేసేటోళ్ల కోసమే ఈ స్టోరీ

మందు తాగకపోయినా.. ఫ్యాటీ లివర్‌ ‌‌‌‌‌‌‌! ముఖ్యంగా సాఫ్ట్వేర్ కొలువులు చేసేటోళ్ల కోసమే ఈ స్టోరీ

అమ్మ ఎప్పుడూ ఇంటిని చక్కబెడుతూ బిజీగా ఉంటుంది. ఎవరికి ఏ కష్టం రాకుండా ప్రతి పనిని భుజాన వేసుకుని చేస్తుంది. శరీరంలో కూడా లివర్ అలాంటి పాత్రే పోషిస్తుంది. ఏకకాలంలో లెక్కలేనన్ని పనులు చేస్తుంది. లివర్‌‌‌‌‌‌‌‌ పార్టిసిపేషన్‌‌‌‌ లేకుండా మెటబాలిజంలో ఏ పనీ జరగదు. అంతేకాదు.. పోషకాలను తయారు చేసి, నిల్వ ఉంచుకుంటుంది. అవసరమైనప్పుడు వాటిని బర్న్‌‌‌‌ చేసి ఎనర్జీగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్ని పనులు చేస్తున్నా.. దానిపై మనం మోయలేని భారాన్ని వేస్తున్నాం. దాంతో అది ఫ్యాటీ లివర్‌‌‌‌‌‌‌‌గా మారుతోంది. మరి ఫ్యాట్‌‌‌‌ పెరగకూడదంటే మనం ఏం చేయాలి ?

ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులు ఎంతోమంది తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యమైనది ఫ్యాటీ లివర్‌‌‌‌‌‌‌‌. అయితే.. ఇది గతంలో ఎక్కువగా ఆల్కహాల్‌‌‌‌ తీసుకునేవాళ్లలోనే కనిపించేది. కానీ.. ఇప్పుడు ఆ అలవాటు లేనివాళ్లలో కూడా కామన్​ అయిపోయింది. గతంలో హైదరాబాద్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఐటీ ఉద్యోగుల్లో 84 శాతం మంది మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎంఏఎఫ్‌‌‌‌ఎల్‌‌‌‌డీ)తో బాధపడుతున్నారు.

ఆ తర్వాత వచ్చిన కొన్ని స్టడీల్లో కూడా ఐటీ ఉద్యోగులు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. లివర్ మొత్తం బరువులో పది శాతానికి మించి ఫ్యాట్‌‌‌‌ ఉంటే దాన్ని ఫ్యాటీ లివర్‌‌‌‌గా పరిగణిస్తారు. దీన్ని సరైన సమయంలో గుర్తించకపోతే.. లివర్‌‌‌‌‌‌‌‌ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ లాంటి తీవ్ర పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉంది. 

లివర్ పనేంటంటే.. 
లివర్ రోజూ వందలాది పనులు చేస్తూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియలో ఉపయోగపడే బైల్ జ్యూస్‌‌‌‌ని తయారు చేసి, కొవ్వు పదార్థాలను విచ్చిన్నం చేసి జీర్ణమయ్యేందుకు సాయపడుతుంది. టాక్సిన్స్‌‌‌‌ని బయటకు పంపుతుంది. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లను ప్రాసెస్ చేయగలదు. అవసరమైనప్పుడు రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌‌‌‌ని స్థిరంగా ఉంచేందుకు గ్లైకోజెన్‌‌‌‌ను గ్లూకోజ్‌‌‌‌గా మార్చేస్తుంది. ఇలా ఎన్నో పనులు చేస్తుంది. కానీ..  దీనికి ఒక బలహీనత కూడా ఉంది. అదేంటంటే కొవ్వుని ఎక్కువ కాలం నిల్వ చేసుకోలేదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగినప్పుడు ఈ బలహీనత బయటపడుతుంది.

ఇన్సులిన్ రెసిస్టెన్సే..
సాధారణంగా బ్లడ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌లో లివర్ ఎంజైమ్స్‌‌‌‌ (ఏఎల్టీ, ఏఎస్టీ) పెరిగినట్టు తేలితే డాక్టర్లు అల్ట్రాసౌండ్‌‌‌‌ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్​లో ఫ్యాటీ లివర్‌‌‌‌‌‌‌‌ ఉన్నట్టు తేలితే.. అలాంటివాళ్లు బరువుని తగ్గించుకోవడం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఫుడ్‌‌‌‌, ఆల్కహాల్‌‌‌‌ మానేయడం లాంటివి చేసి ఫ్యాటీ లివర్‌‌‌‌‌‌‌‌ని తగ్గించుకోవచ్చు. అయితే.. ఆల్కహాల్‌‌‌‌ అలవాటు లేనివాళ్లలో దీనికి మూల కారణం మెటబాలిక్ ప్రక్రియలే అంటున్నారు ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌. 

ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్సే లివర్‌‌‌‌లో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతోంది. ఫుడ్‌‌‌‌ తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ (షుగర్) పెరుగుతుంది. దాన్ని ఇన్సులిన్ శరీర కణాలు, కండరాలు, ఫ్యాట్ సెల్స్‌‌‌‌కు వెళ్లేలా చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగితే గ్లూకోజ్‌‌‌‌ రక్తంలోనే ఉండిపోతుంది. దాన్ని లివర్‌‌‌‌‌‌‌‌ ఫ్యాట్స్‌‌‌‌గా మార్చి స్టోర్‌‌‌‌‌‌‌‌ చేసుకుంటుంది. అలా ఫ్యాటీ లివర్‌‌‌‌‌‌‌‌ వస్తుంది.

సెడెంట్రీ లైఫ్‌‌‌‌స్టయిల్‌‌‌‌ వల్లే.. 
ఊబకాయం, డయబెటిస్‌‌‌‌, సెడెంట్రీ లైఫ్‌‌‌‌స్టయిల్‌‌‌‌.. ముఖ్యంగా ఈ మూడు కారణాల వల్లే లివర్‌‌‌‌‌‌‌‌లో ఫ్యాట్‌‌‌‌ పేరుకుపోతుంటుంది. ఈ మూడింటికీ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌‌‌‌తో సంబంధం ఉంది. ఐటీ ఉద్యోగుల విషయానికి వస్తే సెడెంట్రీ లైఫ్‌‌‌‌స్టయిల్‌‌‌‌ వల్లే ఫ్యాటీ లివర్‌‌‌‌‌‌‌‌ వస్తోంది. వాళ్లలో చాలామంది ఎక్కువ గంటలు కదలకుండా ఓకేచోట కూర్చోవడం, వ్యాయామానికి దూరంగా ఉండడం, ప్యాకేజ్డ్‌‌‌‌ ఫుడ్స్‌‌‌‌ ఎక్కువగా తినడం లాంటివి చేస్తుంటారు. రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉంటారు. పైగా వాళ్లలో చాలామందికి స్ట్రెస్‌‌‌‌ ఉంటుంది. దానివల్ల కార్టిజాల్‌‌‌‌ పెరిగి ఇన్సులిన్‌‌‌‌ రెసిస్టెన్స్ వస్తుంది. ఇవన్నీ ఫ్యాటీ లివర్‌‌‌‌‌‌‌‌కు దారి తీస్తాయి.

ఏం తినాలి ? 
ఫ్యాటీ లివర్ రాకుండా ఉండాలంటే ఆకుకూరలు, పండ్లు, ధాన్యాలు, హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం మంచిది. ఇవి బరువుతోపాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్‌‌‌‌ను తగ్గించి లివర్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ముఖ్యంగా పాలకూర, బ్రోకలీ, క్యారెట్, టమాటా, బీట్‌‌‌‌రూట్ లాంటివి తినాలి. ఆపిల్, బత్తాయి, బెర్రీలు.. లాంటి తీపి తక్కువగా ఉండే పండ్లని ఎంచుకోవాలి. బాదం, వాల్‌‌‌‌నట్స్, ఫ్లాక్స్, చియా సీడ్స్ డైట్‌‌‌‌లో భాగం చేసుకోవాలి. వైట్ రైస్‌‌‌‌కు బదులు బ్రౌన్ రైస్, రాగి, జొన్నలు తీసుకోవడం బెటర్​. సాల్మన్, ట్యూనా లాంటి చేపలు, స్కిన్​లెస్​ చికెన్, గుడ్లు, పప్పులు తినాలి. చేపలు, చికెన్‌‌‌‌ లాంటివాటిని డీప్ ఫ్రై చేయకుండా ఉడికించి తినాలి.

ఇవి వద్దు
కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన ఫ్రూట్ జ్యూస్‌‌‌‌లు, స్వీట్స్‌‌‌‌ (గులాబ్ జామున్, జిలేబీ లాంటివి), చాక్లెట్ జోలికి వెళ్లకూడదు. రిఫైన్డ్ కార్బ్స్ అంటే వైట్ రైస్, మైదా, వైట్ బ్రెడ్ లాంటివి ఎంత తక్కువ తింటే అంత మంచిది. ప్రాసెస్డ్ ఫుడ్స్‌‌‌‌, సమోసా, పకోడా, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్, ఫ్రైడ్ చికెన్, చిప్స్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇన్‌‌‌‌స్టంట్ నూడుల్స్, ప్రాసెస్డ్ మీట్ కూడా ప్రమాదమే. రెడ్ మీట్, ఫుల్ ఫ్యాట్ డైరీ (బటర్, చీజ్, క్రీమ్) తగ్గించాలి. ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగేందుకు కారణమవుతాయి.

పైగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌‌‌‌లో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. అది లివర్ ఆరోగ్యానికి అంత మంచిదికాదు. గ్లూకోజ్‌‌‌‌ను శరీరంలోని ప్రతి కణం మెటబాలైజ్ చేయగలదు. కానీ, ఫ్రక్టోజ్‌‌‌‌ను లివర్ మాత్రమే ప్రాసెస్ చేస్తుంది. ఫ్రక్టోజ్ స్వీటెన్డ్ డ్రింక్స్​ను కొన్ని వారాలపాటు రోజూ తాగినవాళ్ల లివర్‌‌‌‌లో ఫ్యాట్ పెరిగినట్టు స్టడీల్లో తేలింది. అంటే ఫ్రక్టోజ్ ఎక్కువ తీసుకుంటే బరువు పెరగకున్నా లివర్‌‌‌‌‌‌‌‌లో ఫ్యాట్‌‌‌‌ పేరుకుపోతుంది. 

అధిక బరువు ఉంటే..​
ఫ్యాటీ లివర్‌‌‌‌‌‌‌‌ మొదటి రెండు దశల్లో ఎలాంటి సింప్టమ్స్‌ కనిపించవు. కాబట్టి టెస్ట్‌‌‌‌లు చేస్తే తప్ప గుర్తించలేం. కానీ.. మూడు లేదా నాలుగో గ్రేడ్‌‌‌‌లో మాత్రం జాండిస్‌‌‌‌, చర్మ సంబంధిత సమస్యలు, పొట్ట ఉబ్బరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే అధిక బరువు ఉన్నవాళ్లు రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా హెల్త్ చెకప్స్​ చేయించుకుంటే స్టార్టింగ్‌‌‌‌ స్జేజీలో తెలుసుకోవచ్చు. దీనికి బరువు తగ్గడమే సరైన మందు. అప్పటికే తక్కువ బరువు ఉన్నవాళ్లు లైఫ్‌‌‌‌ స్టయిల్లో మార్పులు చేసుకోవాలి. ఫ్యాటీ లివర్‌‌‌‌‌‌‌‌ ప్రభావం ఇమ్యూన్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌పై కూడా ఉంటుంది.

అందుకే కరోనా టైంలో అధికబరువు, ఫ్యాటీ లివర్‌‌‌‌‌‌‌‌ ఉన్నవాళ్లు ఎక్కువ రిస్క్‌‌‌‌లో పడ్డారు. బీపీ, డయాబెటిస్‌‌‌‌ లాంటివాటికి లైఫ్‌‌‌‌లాంగ్‌‌‌‌ ఎలా మెడిసిన్ వాడుతున్నామో ఫ్యాటీ లివర్‌‌‌‌‌‌‌‌ ఉన్నవాళ్లు కూడా లైఫ్‌‌‌‌ లాంగ్ హెల్దీ హ్యాబిట్స్‌‌‌‌ పాటిస్తూనే ఉండాలి. లేదంటే మళ్లీ మళ్లీ ఫ్యాట్‌‌‌‌ పెరిగే ప్రమాదం ఉంది. కొందరిలో మాత్రం ఈ సమస్య జెనిటిక్స్ వల్ల వస్తుంది. అలాంటివాళ్లు కాస్త బరువు పెరిగినా ప్రమాదమే. ఆల్కహాల్‌‌‌‌కి కూడా దూరంగా ఉండాలి. తక్కువ బీఎంఐ ఉన్నా కొందరి బాడీలో ఎక్కువ ఫ్యాట్‌‌‌‌ ఉంటుంది. ముఖ్యంగా విసెరల్ ఫ్యాట్ లెవెల్స్‌‌‌‌ ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఓవర్‌‌‌‌ వెయిట్ లేకున్నా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది.