నెరవేరిన నవీన్ యాదవ్ కల.. ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో ‘‘అధ్యక్షా’’ అంటూ ఫస్ట్ స్పీచ్

నెరవేరిన నవీన్ యాదవ్ కల.. ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో ‘‘అధ్యక్షా’’ అంటూ ఫస్ట్ స్పీచ్

హైదరాబాద్: ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కల నెరవేరింది. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సోమవారం హాజరయ్యారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం నవీన్ యాదవ్ అందరు సభ్యులతో కలిసి తొలిసారిగా అసెంబ్లీకి హాజరు కావడం విశేషం. ఆయనకు కేటాయించిన స్థానంలో కూర్చున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో నవంబర్లోనే ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్.. నవీన్ యాదవ్తో  ప్రమాణం చేయించారు.

దాదాపు పదహారేండ్ల కింద రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నవీన్​ యాదవ్​.. తన కలను సాకారం చేసుకున్నారు. జూబ్లీహిల్స్​ గడ్డపై ఎమ్మెల్యేగా గెలిచి.. అత్యధిక మెజార్టీతో రికార్డు సృష్టించారు. రాజకీయాల్లోకి ఆయన 2009లో అడుగుపెట్టారు. ఎంఐఎంలో ప్రస్తానం ప్రారంభించారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగారు. 2023 నవంబర్​లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. జూబ్లీహిల్స్​ బైపోల్​లో విజయకేతనం ఎగురవేశారు.

2009లో యూసుఫ్​గూడ డివిజన్లో ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్గా నవీన్​ యాదవ్​ పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి మురళీగౌడ్​ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో ఎంఐఎం తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి.. ఓటమి పాలయ్యారు. ఆయన  41,656 ఓట్లు (25.19 శాతం) సాధించి రెండో స్థానంలో నిలిచారు. తర్వాత ఎంఐఎం అభ్యర్థిగా రహమత్​నగర్​ డివిజన్​ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు.

మళ్లీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్​ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పుడు ఆయన 18 వేల 817 ఓట్లు సాధించారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన ఆయన సతీమణి మాగంటి సునీతపై కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.