హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో నాటు బాంబులు కలకలం రేపాయి. గర్గుల్ గ్రామ శివారులోని మొగుళ్ల సాయగౌడ్ పొలంలో నాటు బాంబు పేలడంతో అక్కడికక్కడే కుక్క మృతి చెందింది. బాంబు పేలుడు ధాటికి భారీ శబ్దం, పొగ రావడంతో ఉలిక్కిపడ్డారు చుట్టుపక్కలున్న రైతులు.
ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమ పొలాల్లో బాంబులు వేసి వెళ్లారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బాంబుల భయంతో కూలీలు ఎవరూ పనికి రావడం లేదని వాపోయారు రైతులు. యాసంగి వరి నాట్లు వేసే సీజన్ అవడంతో పంట దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు.. నాటు బాంబు పేలుళ్లపై బాధితుడు సాయగౌడ్ దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు. వీలైనంత తొందరగా నిందితుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు రైతులు. అడవి పందుల కోసం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పెట్టి ఉండవచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు.
