బీర్కూర్, వెలుగు : మండలంలోని బీర్కూర్, తిమ్మాపూర్ గ్రామాల శివారులోని తెలంగాణ తిరుమల ఆలయంలో గురువారం శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. దేవనాధ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, పుష్ప దంపతులు, కుటుంబీకులు పాల్గొన్నారు. అనంతరం మాడవీధుల్లో హనుమ వాహనంపై స్వామివారిని ఊరేగించారు.
భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమం నిర్వహించింది. పోచారం కుటుంబీకులు పోచారం శంభు రెడ్డి, ప్రేమల దంపతులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, సోని రెడ్డి దంపతులు, పోచారం సురేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బాల్కొండలో..
బాల్కొండ : బాల్కొండ మండలం వన్నెల్(బి)లోని వేంకటేశ్వర స్వామి కల్యాణం గురువారం కమణీయంగా జరిగింది. ఆలయ పూజారి నవీన్ ఆచారి ఆధ్వర్యంలో వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య ముత్యాల తలంబ్రాలతో స్వామివారి కల్యాణ క్రతువు పూర్తి చేశారు. ఉదయం అభిషేకం, అంకురార్పణ, మండప అర్చన, బలిహరణం, పంచామృతాలతో అభిషేకం, శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులకు గ్రామంలో రథోత్సవం, రాత్రి స్వామివారికి ఏకాంత సేవ
జరిపించారు.
