ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి రఘు, వైస్ చైర్సన్గా కాట్ పల్లి వెంకటరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు తాహెర్ బిన్ హందాన్, మానాల మోహన్ రెడ్డి, ఈరవత్రి అనిల్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్ చిన్నా హాజరై నూతన చైర్పర్సన్, వైస్ చైర్మన్ లను అభినందించారు.
మున్సిపల్‌చైర్ పర్సన్ లహరి మాట్లాడుతూ కౌన్సిలర్ గా పోటీ చేయించినందుకు కాంగ్రెస్ కు ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు, వినయ్ రెడ్డి, ఏబీ శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కమిషనర్ ఉమామహేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు త్రివేణి గంగాధర్, స్వాతి సింగ్ బబ్లు, అయ్యప్ప శ్రీనివాస్, సర్పంచ్‌లు యాళ్ల సాయి రెడ్డి, కొండి నడిపి గంగాధర్, కౌన్సిలర్లు, పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
కౌన్సిలర్లకు సన్మానం..
ఆర్మూర్ మున్సిపల్ లో ఇటీవల గెలిచిన మున్నూరు కాపు వర్గానికి చెందిన సడాక్ వినోద్, నర్మే నవీన్, కొడిగెల మల్లయ్య, బోగడమిది రాణి సుమన్, తాటి నీలిమ-హన్మండ్లు, యామాద్రి భాస్కర్, పోచంపాడ్ శ్రీనివాస్ లను మున్నూరు కాపు మూడు సదర్ల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. మున్నూరు కాపు సదర్లు తెడ్డు బాల్ రెడ్డి, గోర్త దేవేందర్, బండి పోశెట్టి, మున్నారు కాపు పెద్ద మనుషులు పాల భాస్కర్, ఆకుల గంగా రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
