Allu Sirish Wedding Date: సెంటిమెంట్ డేట్.. అల్లు అర్జున్ పెళ్లిరోజునే శిరీష్ పెళ్లి ఫిక్స్.. స్టైలిష్ వీడియో వైరల్

Allu Sirish Wedding Date: సెంటిమెంట్ డేట్.. అల్లు అర్జున్ పెళ్లిరోజునే శిరీష్ పెళ్లి ఫిక్స్.. స్టైలిష్ వీడియో వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. 2026 సంవత్సరంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టేటస్కు అల్లు శిరీష్ శుభం కార్డు పలకనున్నారు. సోమవారం డిసెంబర్ 29న అల్లు శిరీష్‌‌‌‌‌‌‌‌ పోస్ట్ చేసిన ఓ వీడియోతో పెళ్లితేదిపై క్లారిటీ వచ్చింది. అల్లువారి సెంటిమెంట్ డేట్ రోజునే తన ప్రియురాలు నయనిక రెడ్డి మెడలో తాళికట్టనున్నారు శిరీష్. వివరాల్లోకి వెళితే.. 

హీరో అల్లు శిరీష్ తన పెళ్లి డేట్‌ను ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ వీడియోలో తన పెద్దన్నయ్య కూతురితోపాటు తన రెండవ అన్నయ్య అల్లు అర్జున్ పిల్లలైనా అల్లు అర్హ, అల్లు శిరీష్ లతో కలిసి ట్రెండింగ్ సాంగ్తో పెళ్లి డేట్ను రివీల్ చేశాడు అల్లు శిరీష్. అమ్మాయిలు ఇద్దరూ పెళ్లెప్పుడు బాబాయ్ ? అని అడగగా.. అల్లు అయాన్తో కలిసి 2026 మార్చి 6 అంటూ తెలిపారు.

అమ్మాయిలు ఇద్దరు సంగీత్ ఎప్పుడు బాబాయ్ ? అని ప్రశ్నించగా.. మనం సౌత్ ఇండియన్స్ కదా అలాంటివేమి ఉండవు అంటూ సైగలతో క్లారిటీ ఇచ్చారు. ఇలా క్యూరియాసిటీ కలిగించే వీడియోతో పెళ్లి తేదీని ప్రకటించడం చాలా కొత్తగా ఉంది. అయితే, సంగీత్ లాంటి ఈవెంట్స్ ఉండవని చెప్పి ఒకింత అందరిని ఆశ్చర్యపరిచారు అల్లు శిరీష్.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Allu Sirish (@allusirish)

అయితే, ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. అల్లు శిరీష్ మ్యారేజ్ డేట్.. తన అన్న అల్లు అర్జున్-స్నేహా రెడ్డిల పెళ్లి వార్షికోత్సవ తేదీ ఒకటే అవ్వడంతో అల్లువారి ఇంటిలో డబుల్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. అల్లు శిరీష్-నయనిక రెడ్డిల నిశ్చితార్థం 31 అక్టోబర్ 2025న జరిగింది.