హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆయన అందరిలాగే కొత్తగా ఎన్నికైన సర్పంచ్.. కానీ ఆలోచన మాత్రం వెరైటీగా చేశారు. కేవలం గ్రామ సమస్యలను పరిష్కరించడమే కాకుండా కాస్త వినూత్నంగా ఆలోచించి సర్కారు బడి పిల్లలను విజ్ఞాన యాత్రకు తీసుకువెళ్లారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం దత్తాయిపల్లి సర్పంచ్ జేరిపోతుల కరుణాకర్ ఆధ్వర్యంలో జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ఆదివారం హైదరాబాద్‌లోని పలు చారిత్రక ప్రాంతాలను సందర్శించారు.
ఓయూ ఆర్ట్స్ కాలేజీ, అంబేడ్కర్ లైబ్రరీని చూసి ఆశ్చర్యపోయిన విద్యార్థులు అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 38వ బుక్ ఫెయిర్‌ను ఆసక్తిగా తిలకించారు. విహారంలో విజ్ఞానాన్ని జోడిస్తూ సాగిన ఈ యాత్రలో విద్యార్థులు పుస్తక ప్రపంచాన్ని చూసి కొత్త విషయాలు నేర్చుకున్నారని సర్పంచ్ కరుణాకర్ తెలిపారు. వార్డు సభ్యులు పాల్గొన్నారు.
