హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి వాయిదా పడింది. 2026, జనవరి 2వ తేదీకి కౌన్సిల్ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. ఇయర్ ఎండ్ కావడంతో ఈ నెల 30, 31, వచ్చే జనవరి 1 తేదీలు వదిలేసి ఆ తర్వాత 2వ తేదీకి వాయిదా వేశారు. 2025, డిసెంబర్ 29వ తేదీ ఉదయం 10. 30 గంటలకు శాసన మండలి సమావేశం ప్రారంభమైంది. అనంతరం సభలో మాజీ ఎమ్మెల్సీలు మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబ్బీర్లకు సభ్యులు సంతాపం తెలిపారు. సంతాప తీర్మానాల అనంతరం కౌన్సిల్ను చైర్మన్ వాయిదా వేశారు.
