ఒమిక్రాన్ ను గుర్తించే  కిట్ ను రూపొందించిన ICMR

ఒమిక్రాన్ ను గుర్తించే  కిట్ ను రూపొందించిన ICMR

ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్​ను ముందుగానే గుర్తించేందుకు ..ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)సరికొత్త కిట్​ను రూపొందించింది. ఈ కిట్​ను కమర్సియల్ గా ఉపయోగించుకునేందుకు.. కిట్లను సొంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు  కావాల్సిన సాంకేతికతను బదిలీ చేసేందుకు ఇన్​ విట్రో డయొగ్నాస్టిక్స్​ (IVD) కిట్​ తయారీదారుల నుంచి ఎక్స్​ప్రెషన్​ ఆఫ్​ ఇంట్రెస్ట్​ (EOI) కోసం ఆహ్వానించింది. ఒమిక్రాన్​ను గుర్తించేందుకు కావాల్సిన RTPCR,కిట్​ను డిబ్రుగఢ్​లోని ICMR​ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసింది. దీనిపై పేటెంట్ హక్కులు,  కమర్సియల్ హక్కులు తమకే ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది. అగ్రిమెంట్ కుదుర్చున్న వారికి కిట్​ను తయారు చేసి, అమ్ముకునే అధికారాన్ని ఇస్తామని తెలిపింది.

ప్రస్తుతం ఒమిక్రాన్​ను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి కిట్​లు లేవు. అనుమానిత రోగుల నుంచి నమూనాలను సేకరించి జినోమ్​ సీక్వెన్సింగ్​ కోసం ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. దీంతో ఫలితాలు తేలేందుకు ఆలస్యమవుతోంది. ఈ సమయంలో ఐసీఎమ్​ఆర్​  నిర్ణయం తీసుకోవడం హర్షనీయమంటున్నారు నిపుణులు.  కిట్​ను ఉపయోగించి ఒమిక్రాన్​ను వేగంగా గుర్తించినట్లయితే.. రోగికి మెరుగైన చికిత్స అందిస్తూనే, వైరస్​ కట్టడికి చర్యలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తికి గాంధీలో చికిత్స