కృత్రిమ కాలును అభివృద్ధి చేసిన ఐఐటీ గౌహ‌తి ప‌రిశోధ‌కులు

కృత్రిమ కాలును అభివృద్ధి చేసిన ఐఐటీ గౌహ‌తి ప‌రిశోధ‌కులు

న్యూఢిల్లీ : ఐఐటీ గౌహ‌తి ప‌రిశోధ‌కులు కృత్రిమ కాలును డెవ‌ల‌ప్ చేశారు. అడ్వాన్స్‌డ్ ఫీచ‌ర్స్‌తో దీన్ని రూపొందించారు. అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ఈ ప్రొస్‌థెటిక్ లెగ్‌ను డిజైన్ చేశారు. ఎత్తైన గుట్టలు, కొండ‌లు ఎక్క‌డంలోనూ ఈ కృత్రిమ కాలు ఉప‌యోగ‌ప‌డ‌నుంది. కాళ్ల మీద కూర్చునే వీలుగానూ ఉండేలా దీన్ని డిజైన్ చేశారు.

అన్ని వయస్సుల వారు ఉపయోగించే పద్ధతిలో ప్రోస్‌థెటిక్స్‌ను అభివృద్ధి చేశారు. కేంద్ర విద్యాశాఖ‌, భార‌త ప్ర‌భుత్వం, బ‌యోటెక్నాల‌జీ శాఖ‌, ఐఐటీ గౌహ‌తి ప‌రిశోధ‌కులు ఈ కృత్రిమ కాలు త‌యారీకి నిధులు సమకూర్చారు. 151 ఆర్మీ బేస్ హాస్పిట‌ల్‌తో జ‌త‌క‌ట్టిన ప‌రిశోధ‌కులు ఈ కాలును రూపొందించారు. చాలా తక్కువ ధ‌ర‌లోనే ఈ కృత్రిమ కాలును మార్కెట్‌లోకి విడుదల చేయ‌నున్నారు.