ఐటీఆర్‌‌ ఫైలింగ్‌‌కు డెడ్‌‌లైన్‌‌ దాటితే రూ.5 వేల ఫైన్‌‌‌‌ 

ఐటీఆర్‌‌ ఫైలింగ్‌‌కు డెడ్‌‌లైన్‌‌ దాటితే రూ.5 వేల ఫైన్‌‌‌‌ 

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: ఇండివిడ్యువల్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌పేయర్లందరూ ఈ నెలాఖరులోపు ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌  రిటర్నులు (ఐటీఆర్‌‌‌‌) ఫైల్ చేయాలని ఆదాయపుపన్ను శాఖ ఇది వరకే పేర్కొంది. ఆదాయపు పన్ను చట్టం  సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం, సెక్షన్ 139 (1) ప్రకారం పేర్కొన్న డెడ్‌‌‌‌లైన్‌‌‌‌ తర్వాత ఐటీఆర్ అందజేస్తే రూ. 5 వేల ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం ఐటిఆర్ ఫైలింగ్‌‌‌‌ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అయితే ఇండివిడ్యువల్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌పేయర్‌‌‌‌ గడువు తేదీలోగా ఐటీఆర్‌‌‌‌ ఇవ్వకుంటే పన్నుబకాయిపై వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుంది.   ఏడాదిలో మొత్తం ఆదాయం రూ. 5 లక్షలు మించనివాళ్లు అయితే లేట్‌‌‌‌ ఫైలింగ్‌‌‌‌కు  రూ.వెయ్యి ఫైన్‌‌‌‌ కట్టాలి.    తప్పనిసరిగా ఐటీఆర్‌‌‌‌ ఇవ్వాల్సిన అవసరం లేనివారికి డెడ్‌‌‌‌లైన్ వర్తించబోదని ఐటీశాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. 

ఐటీఆర్ ఫైలింగ్ ఇలా.. 

1.ఐటీఆర్ ఈ–-ఫైలింగ్ కోసం https://www.incometax.gov.in కి వెళ్లాలి.
 2. యూజర్ ఐడీ (పాన్ కార్డు నంబరు), పాస్‌‌‌‌వర్డ్, క్యాప్చా కోడ్‌‌‌‌ను నమోదు చేయడం ద్వారా ఈ-–ఫైలింగ్ పోర్టల్‌‌‌‌కి లాగిన్ అవ్వాలి.  
3.ఇప్పుడు 'ఈ–-ఫైల్' మెనుపై క్లిక్ చేసి తరువాత 'ఐటీఆర్' లింక్‌‌‌‌పై క్లిక్ చేయాలి.
4.ఐటీఆర్ పేజీ పేజీలో: పాన్ ఆటో–-పాపులేషన్ అవుతుంది. ఇప్పుడు
‘అసెస్‌‌‌‌మెంట్ ఇయర్’ ను, ‘ఐటిఆర్ ఫారం నంబర్’ను సెలెక్ట్ చేసుకోవాలి.  ఫైలింగ్ టైప్ ను   ‘ఒరిజినల్/రివైజ్డ్ రిటర్న్‌‌‌‌గా’ గా ఎంచుకోవాలి.  ‘సెలెక్ట్ సబ్ మిషన్ మోడ్’ను ‘ప్రిపేర్‌‌‌‌ అండ్ సబ్‌‌‌‌మిట్‌‌‌‌ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌’ అని సెలెక్ట్‌‌‌‌ చేసుకోవాలి. 
5. ఇప్పుడు ‘కంటిన్యూ’ ఆప్షన్‌‌‌‌ మీద క్లిక్ చేయండి.
6. ఇప్పుడు ఇక్కడ కనిపించే సూచనలను జాగ్రత్తగా చదవాలి.  ఆన్‌‌‌‌లైన్ ఫారమ్‌‌‌‌లోని అన్ని ఖాళీలను తప్పనిసరిగా పూరించాలి.
7.'ట్యాక్సెస్ పెయిడ్ అండ్  వెరిఫికేషన్' ట్యాబ్‌‌‌‌లో తగిన వెరిఫికేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి.
8.'ప్రివ్యూ అండ్ సబ్మిట్’ బటన్‌‌‌‌పై క్లిక్ చేయండి. ఐటీఆర్​ ఇచ్చిన మొత్తం డేటాను సరిచూసుకొని చివరగా ‘సబ్మిట్’ ఆప్షన్‌‌‌‌ మీద క్లిక్ చేస్తే పని పూర్తి అవుతుంది. 

5 నెలల్లో రూ.67 కోట్ల విలువైన రీఫండ్లు

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో ట్యాక్స్‌‌‌‌ పేయర్లకు రూ.67,400 కోట్ల విలువైన ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ రీఫండ్లు ఇచ్చామని ఆదాయపుపన్నుశాఖ శనివారం ప్రకటించింది. మొత్తం 23.99 లక్షల మంది ట్యాక్స్‌‌‌‌పేయర్లకు ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌ నుంచి ఆగస్టు 30 మధ్య వీటిని సెంట్రల్ బోర్డ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ డైరెక్ట్‌‌‌‌ (సీబీడీటీ) చెల్లించింది.  22.61 లక్షల ఇండివిడ్యువల్​ కేసుల్లో రూ.16,373 కోట్ల విలువైన రీఫండ్లు చెల్లించామని, కార్పొరేట్‌‌‌‌ రీఫండ్ల కోసం రూ.51,029 కోట్లు ఖర్చు చేశామని ఐటీశాఖ ట్వీట్‌‌‌‌ చేసింది.

.