మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి బదిలీతో గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి. ఎస్ఐ బదిలీ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ బాణాసంచా పేల్చుతూ పండగ వాతావరణంలో ఆనందం వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఎస్ఐ గత కొంతకాలంగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ..ప్రశ్నించిన వారిపై దాడులు చేసేవాడని అంటున్నారు గ్రామస్తులు. అక్రమ కేసులు నమోదు చేసి తమను ఇబ్బంది పెట్టిన ఎస్ఐ బదిలీ కావడంతో తమకు రిలీఫ్ కలిగిందని అంటున్నారు గ్రామస్తులు. సైకో ఎస్ఐ నుండి తమ గ్రామానికి విముక్తి కలిగిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.
అంతే కాకుండా.. పరిధి దాటి ఇతర గ్రామాల వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకునేవాడని.. ఇతర అధికారుల పనుల్లో జోక్యం చేసుకొని జనాన్ని తీవ్ర ఇబ్బందికి గురిచేసే వాడని అంటున్నారు గ్రామస్తులు. అన్ని గ్రామాల్లో రాజకీయాలు చేస్తూ ఇతర అధికారుల డ్యూటీలు కూడా తానే చేస్తున్నట్లు వ్యవహరించేవాడని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు.
ఎస్ఐ తీరుతో సామాన్య జనం చాలా ఇబ్బందికి గురయ్యారని... ఇప్పుడు ఆయన బదిలీ కావడంతో ఉపశమనం లభించిందని అంటున్నారు. ఎస్ఐ బదిలీకి సంబంధించి చర్యలు తీసుకున్న తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ లకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు గ్రామస్తులు.

