న్యూఢిల్లీ: గత ఐదేండ్లలో సుమారు 13 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు ఏటా సగటున 22 శాతం కంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చాయి. రీసెర్చ్ ప్లాట్‌ఫామ్ ఏసీఈ ఎంఎఫ్ ప్రకారం, మొత్తం 207 ఫండ్లలో ఇవి బెస్ట్‌గా నిలిచాయి.
* మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్ అత్యధికంగా 24.27 శాతం రిటర్న్ ఇచ్చింది. అంటే ఐదేండ్ల క్రితం ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఇప్పుడు అది దాదాపు మూడు లక్షల రూపాయలుగా మారేది.
* బంధన్ స్మాల్‌క్యాప్ ఫండ్ 23.56 శాతం రిటర్న్ ఇచ్చి, ఒక లక్ష పెట్టుబడిని 2.87 లక్షలుగా మార్చింది. నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్‌క్యాప్ ఫండ్ 23.33 శాతం, నిప్పాన్ ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ 23.15 శాతం రిటర్న్ ఇచ్చాయి.
* ఇన్వెస్కో ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ ఏటా సగటున 22.78 శాతం లాభాన్నిచ్చింది. రూ.ఒక లక్ష పెట్టుబడిని రూ.2.79 లక్షలుగా మార్చింది.
* హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్ ఫండ్ 22.55 శాతం రిటర్న్ ఇవ్వగా, క్వాంట్ స్మాల్‌క్యాప్ ఫండ్ ఏటా సగటున 22.39 శాతం రిటర్న్ ఇచ్చింది. ఐదేళ్ల క్రితం వీటిలో రూ.ఒక లక్ష పెట్టుబడి పెడితే అది ఇప్పుడు రూ. 2.74 లక్షలుగా మారేది.
* నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ 22.18 శాతం, ఇన్వెస్కో ఇండియా మిడ్‌క్యాప్ ఫండ్ 21.89 శాతం, ఎడెల్వీస్ మిడ్‌క్యాప్ ఫండ్ 21.78 శాతం రిటర్న్ ఇచ్చాయి.
* హెచ్‌డీఎఫ్‌సీ ఫోకస్డ్ ఫండ్ 21.71 శాతం, మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్ 21.69 శాతం, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మిడ్‌క్యాప్ ఫండ్ 21.59 శాతం రిటర్న్ ఇచ్చాయి. మొత్తంగా చూస్తే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్లు అత్యధిక లాభాలిచ్చాయి. ఐదేళ్ల కాలంలో రూ.ఒక లక్ష పెట్టుబడి రూ.2.7 లక్షల నుంచి 3 లక్షలకు చేరింది.

