ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీటి తరలింపు షురూ..

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీటి తరలింపు షురూ..

పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అధికారుల ఆదేశాల మేరకు నీటిని తరలిస్తున్నారు. ఇందులో భాగంగా ఎల్లంపల్లిలోని నంది మేడారంలో గల నాలుగు నంది పంప్‌హౌజ్‌ల ద్వారా అధికారులు నీటిని  ఎత్తిపోస్తున్నారు.

మొత్తం నాలుగు మోటార్ల సహాయంతో 12,600 క్యూసెక్కుల నీటిని నంది మేడారం నుంచి గాయత్రి పంప్‌హౌజ్ లోకి తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఎస్సారెస్పీ (SRSP) ఫ్లడ్ కెనాల్‌ (వరద కాలువ) ద్వారా మిడ్ మానేరు ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రధానంగా హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 275 క్యూసెక్కుల నీటిని అధికారులు తరలిస్తున్నారు. మరోవైపు, ప్రస్తుత సాగునీటి అవసరాల దృష్ట్యా లభించిన నీటిని చాలా పొదుపుగా వాడుకునేలా, ప్రతి చుక్కను సద్వినియోగం చేసుకునేలా అధికారులు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించారు.

►ALSO READ | ప్రాజెక్టులకు జలకళ: కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద

చాలా రోజుల గ్యాప్ తర్వాత నీటిని ఎత్తిపోస్తుండటంతో స్థానిక రైతులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గాయత్రి పంప్‌హౌజ్ వద్ద ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక పూజలు నిర్వహించి నీటి విడుదలను లాంఛనంగా ప్రారంభించారు.