ముంబై, చెన్నై కాదురా బాబూ.. RCBయే అసలైన నంబర్–1.. రూ.300 మిలియన్ క్లబ్‌లోకి కోహ్లీ టీమ్

ముంబై, చెన్నై కాదురా బాబూ..  RCBయే అసలైన నంబర్–1.. రూ.300 మిలియన్ క్లబ్‌లోకి కోహ్లీ టీమ్

RCB Brand Value: ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన టీ20 క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) వ్యాపార సామ్రాజ్యం కొత్త శిఖరాలను తాకింది. అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ హులిహాన్ లోకీ (Houlihan Lokey) విడుదల చేసిన 2026 ఐపీఎల్ బ్రాండ్ వాల్యుయేషన్ స్టడీ ప్రకారం, ఐపీఎల్ బిజినెస్ ఎంటర్‌ప్రైజ్ విలువ వార్షికంగా 11.4 శాతం పెరిగి ఏకంగా 20.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1,97,024.68 కోట్లు) చేరుకుంది. వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ రెండంకెల వృద్ధిని నమోదు చేయడం విశేషం. 

ఐపీఎల్ బిజినెస్ వ్యాల్యూ $20 బిలియన్లు: 
ఫ్రాంచైజీల వృద్ధితో పాటు మొత్తం ఐపీఎల్ లీగ్ బిజినెస్ వ్యాల్యూ చరిత్రలోనే తొలిసారిగా $20 బిలియన్ల (సుమారు రూ. 1,91,443 కోట్లు) మార్కును దాటింది. గత ఏడాదితో ($18.5 బిలియన్లు) పోలిస్తే ఇది 11.4 శాతం పెరుగుదల. అలాగే ఐపీఎల్ స్టాండ్-ఎలోన్ బ్రాండ్ వ్యాల్యూ కూడా 10.3 శాతం పెరిగి $3.9 బిలియన్ల నుంచి $4.3 బిలియన్లకు (రూ. 41,160 కోట్లు) చేరుకుంది. ఆర్‌సీబీ, ఆర్‌ఆర్ ఫ్రాంచైజీలలో జరిగిన భారీ కొనుగోలు ఒప్పందాలే ఈ చారిత్రాత్మక వృద్ధికి ప్రధాన కారణమని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలో మ్యాచ్ ప్రాతిపదికన అత్యధిక విలువ కలిగిన క్రీడా లీగ్‌లలో అమెరికాకు చెందిన ఎన్ఎఫ్ఎల్ (NFL) తర్వాత ఐపీఎల్ రెండో స్థానంలో కొనసాగుతుంది. 

సీఎస్కేకు షాక్.. 3వ స్థానానికి కేకేఆర్: 
బ్రాండ్ విలువ పట్టికలో ఆర్‌సీబీ (1వ స్థానం), ముంబై ఇండియన్స్ (2వ స్థానం) తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగా, మూడో స్థానం విషయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గత ఏడాది 3వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మైదానంలో వరుస వైఫల్యాల కారణంగా 4వ స్థానానికి పడిపోగా, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) $245 మిలియన్ల విలువతో సీఎస్కేను దాటి 3వ స్థానానికి చేరింది.

►ALSO READ | గురువే దైవం.. ఆచ్రేకర్ స్మారకానికి నివాళులర్పించిన సచిన్.. నెట్టింట వీడియో వైరల్!

ఫ్రాంచైజీల కొనుగోలులో కొత్త రికార్డు: 
2026 ఐపీఎల్ సీజన్ ఫ్రాంచైజీల యాజమాన్యంలో చారిత్రాత్మక మార్పులకు వేదికైంది. 

* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): బ్లాక్‌స్టోన్, బోల్ట్ వెంచర్స్, ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌లతో కూడిన కన్సార్టియం ఆర్‌సీబీని $1.78 బిలియన్లకు కొనుగోలు చేసింది.
 
* రాజస్థాన్ రాయల్స్ (RR): మిట్టల్ ఫ్యామిలీ, అదార్ పూనావాలా కలిసి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని $1.65 బిలియన్ల విలువకి సొంతం చేసుకుంది.    

* క్రీడా రంగంలో అంతర్జాతీయ సంస్థలు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌లు పెడుతున్న ఈ భారీ పెట్టుబడులు ఐపీఎల్ స్థిరమైన రాబడికి, ప్రపంచ స్థాయి మార్కెట్ సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచాయి. 

డిజిటల్ జోరు.. టీవీ రేటింగ్స్‌లో తగ్గుదల: 

* ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్రేక్షకుల వీక్షణ శైలి (Media Consumption) లీనియర్ టెలివిజన్ నుంచి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వైపు వేగంగా దూసుకెళ్లింది. 

* జియోస్టార్ (JioStar) గణాంకాల ప్రకారం: ఐపీఎల్ 2026 మొత్తం 1.06 బిలియన్ స్క్రీన్‌ల రీచ్‌ను సాధించగా, వ్యూయర్‌షిప్ గత ఏడాదితో పోలిస్తే 7 శాతం పెరిగింది. తొలి వీకెండ్‌లోనే 515 మిలియన్ల మంది ప్రేక్షకులు 32.6 బిలియన్ నిమిషాల వీక్షణ సమయాన్ని నమోదు చేశారు.  

* కనెక్టెడ్ టీవీ (CTV): టీవీల కంటే స్మార్ట్/కనెక్టెడ్ టీవీల వీక్షణ శాతంలో ఏకంగా 26 శాతం వృద్ధి నమోదు అయింది.   

* సాంప్రదాయ టీవీ (Linear TV): టీవీ రేటింగ్స్‌లో 18.8 శాతం తగ్గుదల ఈసారి కనిపించింది.  

* మొత్తం ఆదాయం: డిజిటల్ వైపు మొగ్గుచూపడంతో గూగుల్ జెమిని (Google Gemini)తో 3 ఏళ్ల ఒప్పందం లాంటి భారీ డిజిటల్ భాగస్వామ్యాలు సాధ్యమయ్యాయి. దీంతో ఐపీఎల్ మొత్తం ఆదాయం $1.8 బిలియన్లు దాటింది.