ఢిల్లీ నిరసనల్లో విద్యార్థులపై పోలీసు దాడులను లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు.అమాయకపు విద్యార్థులను కరెంట్, మేకులు కొట్టిన లాఠీలతో తీవ్రంగా కొట్టారు.. పిల్లెట్ గన్స్ పేల్చారు..పోలీసు దాడుల్లో గాయపడిన విద్యార్థులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.. విద్యార్థులపై దాడి విజువల్స్ దేశమంతా చూసింది.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలతోనే ఈ అమానుష దాడి జరిగిందన్నారు రాహుల్ గాంధీ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులపై పాశవిక దాడిని లోక్ సభలో ప్రశ్నించాను. విద్యార్థులపై దాడిని నిరసిస్తూ మాట్లాడుతుంటే తన గొంతు నొక్కారని రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజుజు, జితేంద్ర సింగ్ లు పదే పదే తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మండపడ్డారు.
►ALSO READ | అది ఏఐ వీడియో... నిరూపిస్తే బీహార్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటా..బీజేపికి పీకే సవాల్
ఢిల్లీ నిరసనల్లో పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఆర్ పీఎఫ్, పారామిలిటరీ దళాలు కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తాయి, హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలతో కాల్పులు జరిగాయన్నారు. కాల్పుల విజువల్స్ దేశమంతా చూసిదన్నారు. అమాయ విద్యా్ర్థులపై పెల్లెట్ గన్స్ తో దాడి చేశారు.. మైనర్ బాలికలను కూడా వదల్లేదని అన్నారు.దాడి చేసినవారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. నిరసన తెలిపే హక్కును హరించారు. విద్యార్థులపై దాడికి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ.
