ఇండియా ఇప్పట్లో వరల్డ్​చాంపియన్ కాలేదు

ఇండియా ఇప్పట్లో వరల్డ్​చాంపియన్ కాలేదు

న్యూఢిల్లీ: ఇండియా క్రికెట్ టీమ్ ఇప్పట్లో వరల్డ్ ​చాంపియన్​ కాలేదని మాజీ  క్రికెటర్ గౌతమ్ గంభీర్​ అభిప్రాయపడ్డాడు. అందుకు గల కారణాలు కూడా వివరించాడు. టీమిండియా క్రికెటర్లు ప్రెజర్​ను సరిగ్గా హ్యాండిల్ చేయలేరన్నాడు. ఉత్తమ ఆటగాడికి, అత్యుత్తమ ఆటగాడికి మధ్య తేడా అదే అన్నాడు. ఈ విషయంలో ఇంప్రూవ్‌‌ కానంత వరకూ ఇండియన్స్‌‌ను వరల్డ్‌‌ చాంపియన్స్‌‌గా పరిగణించలేమన్నాడు. ‘కీలకమైన మ్యాచ్‌‌ల్లో ఎలా ఆడతావన్న దాన్నిబట్టే  టీమ్‌‌లో నువ్వు గుడ్‌‌ ప్లేయరా, వెరీ గుడ్‌‌ ప్లేయరా అనేది తెలుస్తుంది. ఇతర జట్లు ప్రెజర్‌‌ను హ్యాండిల్ చేసిన విధంగా మనోళ్లు  చేయలేకపోతున్నారు. మనం ఆడిన సెమీఫైనల్స్‌‌, ఫైనల్స్‌‌ను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. లీగ్‌‌ స్టేజ్‌‌లో బాగా ఆడి, నాకౌట్స్‌‌లో తడబడుతున్నారు. మెంటల్‌‌ టఫ్​నెస్‌‌ లేకపోవడమే దానికి కారణం. మన టీమ్‌‌లో అన్నీ ఉన్నాయని మాట్లాడుకుంటున్నాం. వరల్డ్‌‌ చాంపియన్స్‌‌ అయ్యే  సత్తా ఉందని అంటున్నాం. కానీ ఫీల్డ్‌‌లో నిరూపించుకోనంత వరకూ మిమ్మల్ని వరల్డ్ చాంపియన్స్‌‌ అనలేరు’ అని గంభీర్​ చెప్పుకొచ్చాడు.

ప్రేక్షకులు ఉంటే ఆ కిక్కే వేరు