బిగ్ ట్విస్ట్ : అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో.. ముగ్గురు కాంగ్రెస్ నేతలు అరెస్ట్

బిగ్ ట్విస్ట్ : అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో.. ముగ్గురు కాంగ్రెస్ నేతలు అరెస్ట్

మార్ఫింగ్ వీడియో, డీప్ ఫేక్ వీడియో అంశంలో తెలంగాణ వర్సెస్ ఢిల్లీ పోలీసుల మధ్య జరుగుతున్న నోటీసులు వ్యవహారం.. కొత్త మలుపు తీసుకున్నది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియోకు సంబంధించిన కేసులో.. తెలంగాణ పోలీసులు ముగ్గురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయటం విశేషం. అమిత్ షా మార్ఫింగ్ వీడియోకు సంబంధించి.. బీజేపీ నేత ప్రేమేందర్ ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా.. తెలంగాణ పోలీసులు ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు. అరెస్ట్ అయిన ముగ్గురు కాంగ్రెస్ నేతల్లో.. మన్నే సతీష్, నవీన్, తస్లీమా ఉన్నారు. వీరిని అమిత్ షా మార్ఫింగ్ వీడియోపై అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు.

రిజర్వేషన్ల అంశంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి.. ఢిల్లీలో బీజేపీ నేతల కంప్లయింట్ కంటే ముందే.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు.. తెలంగాణ బీజేపీ నేత ప్రేమేందర్ కంప్లయింట్ ఇచ్చారు. ఢిల్లీ పోలీసుల నోటీసుల కంటే ముందే.. ఇదే అంశంపై.. బీజేపీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Also Read:బ్రిజ్ భూషణ్కు బీజేపీ షాక్ : తండ్రికి బిస్కెట్.. కొడుక్కి టికెట్!

ఆ ఫిర్యాదుల ఆధారంగా.. ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. మన్నే సతీష్, ప్రేమేందర్, తస్లిమాలను అరెస్ట్ చేసి.. సీసీఎస్ కు తరలించారు పోలీసులు. అమిత్ షా మార్ఫింగ్ వీడియోకు సంబంధించి.. ఢిల్లీ పోలీసుల కంటే.. తెలంగాణ పోలీసులు యాక్షన్ తీసుకోవటం విశేషం..