ఫస్ట్‌‌‌‌ టీ20లో ఇండియా విక్టరీ

ఫస్ట్‌‌‌‌ టీ20లో ఇండియా విక్టరీ

జైపూర్‌‌‌‌: టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌ చేతిలో ఎదురైన పరాజయానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (40 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 62), కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ (36 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 48) దంచికొట్టడంతో.. బుధవారం జరిగిన ఫస్ట్‌‌‌‌ టీ20 మ్యాచ్‌‌‌‌లో ఇండియా 5 వికెట్ల తేడాతో కివీస్‌‌‌‌పై గెలిచింది. దాంతో కెప్టెన్​ రోహిత్​– హెడ్​ కోచ్​ ద్రవిడ్​ జోడీ ప్రయాణం విజయంతో మొదలవగా.. మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో టీమిండియా 1–0 లీడ్‌‌‌‌లో నిలిచింది. ఐపీఎల్‌‌‌‌లో చెలరేగిన కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ వెంకటేశ్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌లో డెబ్యూ చేశాడు. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన న్యూజిలాండ్‌‌‌‌ 20 ఓవర్లలో 164/6 రన్స్‌‌‌‌ చేసింది. గప్టిల్‌‌‌‌ (42 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 70), మార్క్‌‌‌‌ చాప్‌‌‌‌మన్‌‌‌‌ (50 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) రాణించారు. తర్వాత ఇండియా 19.4 ఓవర్లలో 166/5 స్కోరు చేసి నెగ్గింది. సూర్య ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’గా నిలిచాడు.  రెండో మ్యాచ్​ శుక్రవారం జరగనుంది.

భారీ పార్ట్​నర్​షిప్​..

భారీ మంచును దృష్టిలో ఉంచుకొని టాస్‌‌‌‌ గెలిచిన వెంటనే మరో ఆలోచన లేకుండా రోహిత్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ ఎంచుకున్నాడు. దానికి న్యాయం చేస్తూ ఇన్నింగ్స్‌‌‌‌ థర్డ్‌‌‌‌ బాల్‌‌‌‌కే డారిల్‌‌‌‌ మిచెల్‌‌‌‌ (0)ను భువీ (2/24) క్లీన్‌‌‌‌బౌల్డ్‌‌‌‌ చేశాడు. ఈ దశలో గప్టిల్‌‌‌‌, చాప్‌‌‌‌మన్‌‌‌‌.. ఇండియన్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ను అద్భుతంగాఎదుర్కొన్నారు. సెకండ్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 109 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ చేశారు. ఆరో ఓవర్‌‌‌‌లో దీపక్‌‌‌‌ చహర్‌‌‌‌ (1/42) 15 రన్స్‌‌‌‌ ఇవ్వగా పవర్‌‌‌‌ప్లే ముగిసేసరికి కివీస్‌‌‌‌ 41/1 స్కోరు చేసింది. తర్వాతి నాలుగు ఓవర్లలో 24 రన్స్‌‌‌‌ రావడంతో ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌లో కివీస్‌‌‌‌ స్కోరు 65/1గా మారింది. కానీ నెక్స్ట్‌‌‌‌ మూడు ఓవర్లలో గప్టిల్‌‌‌‌, చాప్‌‌‌‌మన్‌‌‌‌ భారీ షాట్స్‌‌‌‌తో రెచ్చిపోయారు. సిరాజ్‌‌‌‌ (1/39), అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌, చహర్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో రెండు సిక్స్‌‌‌‌లు, మూడు ఫోర్లు బాదారు. ఈ క్రమంలో చాప్‌‌‌‌మన్‌‌‌‌ 45 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ సాధించాడు. అయితే తర్వాతి ఓవర్‌‌‌‌లో అశ్విన్‌‌‌‌ (2/23) డబుల్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌ ఇచ్చాడు. 4 బాల్స్‌‌‌‌ తేడాలో చాప్‌‌‌‌మన్‌‌‌‌, ఫిలిప్స్‌‌‌‌ (0)ను పెవిలియన్‌‌‌‌కు పంపాడు. సిరాజ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో లాంగాన్‌‌‌‌లో భారీ సిక్సర్‌‌‌‌ కొట్టిన గప్టిల్‌‌‌‌.. 15 ఓవర్లలో స్కోరును 123/3కి పెంచాడు. ఈ క్రమంలో అతనూ31 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌‌‌ చేశాడు. సీఫర్ట్‌‌‌‌ (12) సిక్స్‌‌‌‌, ఫోర్‌‌‌‌తో టచ్‌‌‌‌లోకి రాగా, గప్టిల్‌‌‌‌ భారీ సిక్సర్‌‌‌‌ కొట్టి 18వ ఓవర్‌‌‌‌లో వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లలో సీఫర్ట్​, రాచిన్‌‌‌‌ రవీంద్ర (7) ఔటైనా, లాస్ట్‌‌‌‌ ఐదు ఓవర్లలో 41 రన్స్‌‌‌‌ రావడంతో కివీస్‌‌‌‌ మంచి టార్గెట్‌‌‌‌ను నిర్దేశించింది.

సూర్య, రోహిత్‌‌‌‌ ధనాధన్‌‌‌‌

భారీ టార్గెట్‌‌‌‌ను ఇండియా మెరుగ్గా ఆరంభించింది. తొలి రెండు ఓవర్లు నెమ్మదించిన రోహిత్‌‌‌‌.. థర్డ్‌‌‌‌ ఓవర్‌‌‌‌ (సౌథీ)లో 4, 4, 6తో, ఐదో ఓవర్‌‌‌‌ (బౌల్ట్‌‌‌‌)లో 6, 4, 4, 6తో 21 రన్స్‌‌‌‌ పిండుకున్నాడు. కానీ నెక్స్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో రాహుల్‌‌‌‌ (15) ఔట్‌‌‌‌కావడంతో ఫస్ట్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 50 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. ఈ దశలో వచ్చిన సూర్యకుమార్‌‌‌‌  నిలకడగా ఆడాడు. 9వ ఓవర్‌‌‌‌లో సిక్స్‌‌‌‌తో 12 రన్స్‌‌‌‌ రాబట్టాడు. తర్వాతి ఓవర్‌‌‌‌లో ఫోర్‌‌‌‌ కొట్టడంతో ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌లో ఇండియా 85/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. 12వ ఓవర్‌‌‌‌లో సూర్య  6, 4తో 15 రన్స్‌‌‌‌ రాబట్టాడు. అయితే 14వ ఓవర్‌‌‌‌లో ఇండియాకు ఊహించని దెబ్బ తగిలింది. బౌల్ట్‌‌‌‌ వేసిన స్లో బౌన్సర్‌‌‌‌ను హుక్‌‌‌‌ చేయబోయిన రోహిత్‌‌‌‌.. రవీంద్ర చేతికి చిక్కడంతో రెండో వికెట్‌‌‌‌కు 59 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్​ అయింది. అయినా జోరు తగ్గని సూర్య ఓ భారీ సిక్సర్‌‌‌‌ తో 34 బాల్స్‌‌‌‌లోనే  ఫిఫ్టీ కంప్లీట్‌‌‌‌ చేసుకున్నాడు. అతని స్పీడుకు 15 ఓవర్లలో ఇండియా స్కోరు 127/2కు చేరింది. 16వ ఓవర్‌‌‌‌లో చకచకా మూడు ఫోర్లు కొట్టిన సూర్య.. తర్వాతి ఓవర్‌‌‌‌లో బౌల్ట్‌‌‌‌ దెబ్బకు క్లీన్‌‌‌‌బౌల్డ్‌‌‌‌ అయ్యాడు. ఇక 18 బాల్స్‌‌‌‌లో 21 రన్స్‌‌‌‌ అవసరమైన దశలో ఈజీగా గెలుస్తారనుకున్న మ్యాచ్‌‌‌‌ను పంత్‌‌‌‌ (17 నాటౌట్‌‌‌‌), శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (5) టెన్షన్‌‌‌‌కు తీసుకొచ్చారు. ఓ ఎండ్​లో పంత్​ను నిలబెట్టి శ్రేయస్​ షాట్లకు ట్రై చేసినా ఒక్కటీ కనెక్ట్‌‌‌‌ కాలేదు. 19వ ఓవర్‌‌‌‌లో అతను ఔటవగా.. రెండు ఓవర్లలో 7 రన్సే లభించాయి. దాంతో, ఇండియా  విజయానికి లాస్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో 10 రన్స్‌‌‌‌ అవసరమయ్యాయి. కొత్త కుర్రాడు వెంకటేశ్‌‌‌‌ (4) ఫోర్‌‌‌‌ కొట్టి వెనుదిరిగాడు. ఇక మూడు బాల్స్‌‌‌‌కు మూడు రన్స్‌‌‌‌ అవసరమైన దశలో పంత్‌‌‌‌ ఫోర్‌‌‌‌తో విజయాన్ని అందించాడు.

సిరాజ్‌‌‌‌కు గాయం

లాస్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ చేస్తూ సిరాజ్‌‌‌‌ గాయపడ్డాడు. ఫస్ట్​ బాల్​కు శాంట్నర్‌‌‌‌ కొట్టిన షాట్​ను ఆపే క్రమంలో బాల్​ అతని ఎడమ చేతి వేళ్లకు బలంగా తగిలి రక్తం వచ్చింది. ఫిజియో వచ్చి కట్టు కట్టాడు. అయితే, మెయిన్​ బౌలర్ల కోటా పూర్తవడంతో సిరాజ్​ అంత పెద్ద గాయాన్ని భరిస్తూనే బౌలింగ్‌‌‌‌ కంటిన్యూ చేశాడు. ఓ వికెట్‌‌‌‌ కూడా తీసి ఔరా అనిపించాడు.

సంక్షిప్త స్కోర్లు

న్యూజిలాండ్‌‌‌‌: 20 ఓవర్లలో 164/6 (గప్టిల్‌‌‌‌ 70, చాప్‌‌‌‌మన్‌‌‌‌ 63, భువీ 2/24, అశ్విన్‌‌‌‌ 2/23), ఇండియా: 19.4 ఓవర్లలో 166/5 (సూర్యకుమార్‌‌‌‌ 62, రోహిత్‌‌‌‌ 48, బౌల్ట్‌‌‌‌ 2/31.