విశాఖలో టీమిండియా విక్టరీ

విశాఖలో టీమిండియా విక్టరీ
  • రాణించిన రుతురాజ్‌‌‌‌, ఇషాన్‌‌‌‌
  • హర్షల్‌‌‌‌కు 4, చహల్‌‌‌‌కు 3 వికెట్లు

విశాఖపట్నం: సిరీస్‌‌‌‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌‌‌లో ఇండియా జూలు విదిల్చింది. ఓపెనర్లు రుతురాజ్‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌ (35 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 57), ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ (35 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54)తో పాటు హార్దిక్‌‌‌‌ పాండ్యా (21 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లతో 31 నాటౌట్‌‌‌‌) దంచికొట్టడంతో.. మంగళవారం జరిగిన మూడో టీ20లో టీమిండియా 48 రన్స్‌‌‌‌ తేడాతో సఫారీలపై గెలిచింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో ప్రొటీస్​ ఆధిక్యాన్ని 2–1కి తగ్గించింది. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 179/5 స్కోరు చేసింది. తర్వాత సౌతాఫ్రికా 19.1 ఓవర్లలో 131 రన్స్‌‌‌‌కు కుప్పకూలింది. క్లాసెన్‌‌‌‌ (29) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. చహల్‌‌‌‌ కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ లభించింది. 

ఓపెనర్లు అదుర్స్‌‌‌‌.. 

ఓపెనర్లు రుతురాజ్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ స్టార్టింగ్‌‌‌‌ నుంచే బ్యాట్‌‌‌‌ ఝుళిపించారు. కానీ లాస్ట్‌‌‌‌లో సఫారీ బౌలర్లు రన్స్‌‌‌‌ కట్టడి చేయడంతో టీమిండియా 200 మార్క్‌‌‌‌ను అందుకోలేకపోయింది. తొలి నాలుగు ఓవర్లు నెమ్మదిగా ఆడిన రుతురాజ్‌‌‌‌.. ఐదో ఓవర్‌‌‌‌లో వరుసగా ఐదు ఫోర్లు కొట్టి జోష్‌‌‌‌ పెంచాడు. ఆ వెంటనే ప్రిటోరియస్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో సిక్సర్‌‌‌‌ బాదడంతో పవర్‌‌‌‌ప్లేలో ఇండియా 57/0 స్కోరు చేసింది. అప్పటివరకు సహచరుడి ఆటను చూసిన ఇషాన్‌‌‌‌.. 9వ ఓవర్‌‌‌‌లో 13 రన్స్‌‌‌‌తో గాడిలోకి వచ్చాడు. 10వ ఓవర్‌‌‌‌లో మహారాజ్‌‌‌‌ (1/24) దెబ్బకు రుతురాజ్‌‌‌‌ ఔట్‌‌‌‌కావడంతో తొలి వికెట్‌‌‌‌కు 97 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ అయ్యింది. శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (14) నిరాశపర్చినా, ఇషాన్‌‌‌‌ మరో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌‌‌‌తో 31 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌‌‌ చేశాడు. కానీ ఇక్కడి నుంచి సఫారీ బౌలర్లు పుంజుకున్నారు. 13 నుంచి 17 ఓవర్ల మధ్య కేవలం 20 రన్సే ఇచ్చి 2 వికెట్లు తీసి దెబ్బకొట్టారు. ఇషాన్‌‌‌‌తో పాటు పంత్‌‌‌‌ (6) ఏడు బాల్స్‌‌‌‌ తేడాలో ఔటయ్యారు. ఈ దశలో వచ్చిన హార్దిక్‌‌‌‌ వీలైనంత వేగంగా ఆడాడు. దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ (6) విఫలమైనా ఆరో వికెట్‌‌‌‌కు 21 రన్స్‌‌‌‌ జత చేశాడు. 

బౌలర్లు సూపర్‌‌‌‌..

తొలి రెండు మ్యాచ్‌‌‌‌ల్లో విఫలమైన ఇండియా బౌలర్లు ఈ పోరులో నిలబడ్డారు.  స్టార్టింగ్‌‌‌‌ నుంచే ముగ్గురు పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌‌‌‌ చేశారు. దీంతో 4వ ఓవర్‌‌‌‌లోనే  ‌‌‌‌బావుమా (8) వికెట్‌‌‌‌ కోల్పోయింది. అయితే హెండ్రిక్స్‌‌‌‌ (23), ప్రిటోరియస్‌‌‌‌ (20) కాసేపు పోరాడారు. కానీ స్పిన్నర్‌‌‌‌ చహల్‌‌‌‌ (3/20) రాకతో సీన్‌‌‌‌ మారిపోయింది. వరుస విరామాల్లో ప్రిటోరియస్‌‌‌‌, డసెన్‌‌‌‌ (1), క్లాసెన్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి మ్యాచ్‌‌‌‌ను మలుపు తిప్పాడు. ఆ తర్వాత హర్షల్‌‌‌‌ పటేల్‌‌‌‌ (4/25) జోరందుకున్నాడు. ఆరంభంలో హెండ్రిక్స్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసిన పటేల్‌‌‌‌.. లోయర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో మిల్లర్‌‌‌‌ (3), రబాడ (9), శంసి (0)ని వరుస విరామాల్లో పెవిలియన్‌‌‌‌కు పంపాడు. మధ్యలో పార్నెల్‌‌‌‌ (22 నాటౌట్‌‌‌‌) మెరుగ్గా ఆడినా.. సహచరుల సహకారం లేకపోవడంతో సఫారీలకు ఓటమి తప్పలేదు