ఇండియన్ అమెరికన్ సైంటిస్ట్​కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్

ఇండియన్ అమెరికన్ సైంటిస్ట్​కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్

వాషింగ్టన్: ఇండియాకు చెందిన అమెరికన్ సైంటిస్ట్ రతన్ లాల్ కు వ్యవసాయంలో నోబెల్ బహుమతికి సమానమైన ప్రతిష్టాత్మక వరల్డ్ ఫుడ్ ప్రైజ్ దక్కింది. డాక్టర్ లాల్.. తన కెరీర్​లో ఐదు దశాబ్దాలకు పైగా పరిశోధనలు చేస్తూ కోట్లాది మంది చిన్నకారు రైతులకు లబ్ధి చేకూర్చారని ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ గురువారం ఒక ప్రకటనలో కొనియాడింది. నేల కేంద్రీకృత విధానాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆహార ఉత్పత్తిని పెంచడం, సహజ వనరులను పునరుద్ధరించడం, పరిరక్షించడంలో ఆయన పరిశోధనలు ఉపయోగపడినందుకు 2020 ఏడాదికి గాను ఈ ప్రైజ్ ను అందిస్తున్నట్లు చెప్పింది. త్వరలోనే ఆయనకు ప్రైజ్ అందించనున్నట్లు పేర్కొంది. ఈ ప్రైజ్ కింద ఆయనకు 2.5 లక్షల యూఎస్ డాలర్లు అందనున్నాయి.