ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి : కలెక్టర్​ రిజ్వాన్​ బాషాషేక్ ​

ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి : కలెక్టర్​ రిజ్వాన్​ బాషాషేక్ ​

జనగామ అర్బన్, వెలుగు : ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని జనగామ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్​ రిజ్వాన్​ బాషాషేక్ ​సూచించారు.​ శుక్రవారం ఆయన ఆర్డీవో ఆఫీస్​లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్​కేంద్రాన్ని పరిశీలించారు. జిల్లాలో మొత్తంగా పోస్టల్​ బ్యాలెట్​కు 3373 మంది దరఖాస్తు చేసుకున్నారని, నియోజకవర్గాల వారీగా ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట జనగామ, స్టేషన్ ఘనపూర్ రిటర్నింగ్ ఆఫీసర్లు కొమురయ్య, వెంకన్న, ఆర్డీవో ఆఫీస్ ఏవో ప్రకాశ్​రావు, తహసీల్దార్ అహ్మద్​ఖాన్, పోలింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

సప్లమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియ

జనగామ అర్బన్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈవీఎంలకు సప్లమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియను శుక్రవారం జనగామ జిల్లా ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ రిజ్వాన్ బాష షేక్ వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి ఎంపీ నియోజకవర్గంలో 39 మంది అభ్యర్థులు, వరంగల్ నియోజకవర్గంలో 42 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున బ్యాలెట్ యూనిట్లను అదనంగా ఏర్పాటు చేయవలసి వచ్చిందన్నారు.

జనగామ నియోజకవర్గంలో 695 బ్యాలెట్ యూనిట్లు, స్టేషన్ ఘనపూర్ లో 738, పాలకుర్తిలో 740 బ్యాలెట్ యూనిట్లు మొత్తంగా 869 పోలింగ్ కేంద్రాలకు 2173 బ్యాలెట్ యూనిట్లు కేటాయించామన్నారు. 181 బ్యాలెట్ యూనిట్లు రిజర్వులో ఉంచామన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ పింకేశ్ కుమార్, వివిధ పార్టీల ప్రతినిధులు, ఏవో రవీందర్, తహసీల్దార్ శ్రీనివాసరావు, సిబ్బంది బాలు, సతీశ్​తదితరులు పాల్గొన్నారు.