సీఎం పర్యటన ఏర్పాట్లు స్పీడప్ చేయండి : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

సీఎం పర్యటన ఏర్పాట్లు స్పీడప్ చేయండి : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

జయశంకర్​ భూపాలపల్లి, వెలుగు: ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను స్పీడప్​చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశించారు. కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సీఎం పరిశీలిస్తారని చెప్పారు.

అనంతరం భూపాలపల్లిలో మున్సిపల్ ఎన్నికల బహిరంగ సభకు హాజరవుతారని పేర్కొన్నారు.  కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఆలయ కమిటీ చైర్మన్​ ముల్కనూరి భిక్షపతి, నాయకులు నాయినేని సంపత్ రావు, గూటోజు కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.