తాడ్వాయి, వెలుగు: సమ్మక్క తల్లి జన్మస్థలమైన బయ్యక్కపేటలో తిరుగువారం పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. సమ్మక్క ప్రధాన పూజారి చందా పరమయ్య లక్ష్మి దంపతుల ఇంటి నుంచి వారు పండించిన పంటలోని విత్తనాల(సుంకు)ను డోలు వాయిద్యాలు, ఆడబిడ్డల హారతుల నడుమ బుధవారం రాత్రి గ్రామంలోని సమ్మక్క గుడికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం వాటిని దేవత గద్దెపై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు, వారి కుటుంబ సభ్యులు గుడిలోనే రాత్రంతా జాగారం చేశారు. గురువారం అమ్మవారికి కోళ్లు, మేకలు సమర్పించారు. గ్రామంలోని బంధువులు, ఆడబిడ్డలు తల్లిని దర్శనం చేసుకున్నారు.
