ధర్మసాగర్, వెలుగు: నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. వేలేరు, ధర్మసాగర్ రైతు వేదికల్లో గురువారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గత ఎమ్మెల్యే పనులు, పథకాలు, పదవులను అమ్ముకున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, సీఎంఆర్ఎఫ్ తదితర పథకాల కోసం ఎవరికీ డబ్బులివ్వొద్దని చెప్పారు. పథకాలు అర్హుల ఇంటికే వస్తాయన్నారు.
ధర్మసాగర్ తహసీల్దార్సదానందం, వేలేరు తహసీల్దార్ కొమి, కాంగ్రెస్ధర్మసాగర్ మండల అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ధర్మసాగర్ మండలంలోని సాయిపేట జీపీ ఆఫీస్లో నిర్వహించిన గ్రామసభకు హాజరయ్యారు. జీపీ భవనం శిథిలావస్థలో ఉందని, గ్రామంలో ప్రధాన రహదారి వెంట డ్రైనేజీ నిర్మించాలని సర్పంచ్లక్ష్మి కోరారు. స్పందించిన ఆయన 6 నెలల్లో ఆయా పనులు పూర్తి చేయిస్తానని, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
