గత ఐదు రోజులుగా తూర్పు గోదావరి జిల్లా జనాన్ని ముప్పు తిప్పలు పెట్టిన పెద్దపులి దొరికేసింది. జిల్లాలోని పలు గ్రామాల్లో సంచరిస్తూ ఆవులు, దూడలపై దాడి చేసి చంపిన పెద్దపులిని ఎట్టకేలకు పట్టుకున్నారు అధికారులు. శుక్రవారం ( ఫిబ్రవరి 6 ) రాయవరం మండలం కూర్మాపురంలో పాడుబడ్డ ఇంట్లో చొరబడ్డ పెద్దపులిని మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకున్నారు అధికారులు.
పెద్దపులిని పట్టుకునేందుకు పూణే నుంచి వచ్చిన రెస్క్యూ టీం నిర్వహించిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. పాడుబడ్డ ఇంటి బయట గన్స్, బోనులతో పహారా కాసిన రెస్క్యూ టీమ్స్ మత్తు ఇంజక్షన్ ఇచ్చి పెద్దపులిని పట్టుకున్నారు.పాడుబడ్డ ఇంటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఫ్లడ్ లైట్స్ పెట్టడంతో పెద్దపులి బయటికొచ్చింది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో పులిని గురి చూసి మత్తు ఇంజక్షన్ షూట్ చేశారు రెస్క్యూ సిబ్బంది.
►ALSO READ | బాత్‌రూమ్‌లు క్లీన్ చేసే కెమికల్స్‌తో తిరుమల లడ్డూ తయారుచేశారు: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
గత ఐదు రోజులుగా కంటి నిండా నిద్ర లేకుండా చేసిన పెద్దపులి చిక్కడంతో ఊపిరి పీల్చుకున్నారు జిల్లా వాసులు.మత్తు ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన పెద్దపులిని బోనులో బందించి అటవీ ప్రాంతంలో వదిలేందుకు తీసుకెళ్లారు అధికారులు.
