బీఆర్ఎస్ నేత కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్రెడ్డి.కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దత్తపుత్రుడు ..కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారారని అన్నారు. దత్తపుత్రుడు కిషన్ రెడ్డి, దొంగ పుత్రుడు కేటీఆర్ కలిసి కేసీఆర్ ను కాపాడుతున్నారుని ఆరోపించారు. కాళేశ్వరం కేసు సీబీఐ కి ఇస్తే 48 గంటల్లో కేసీఆర్ ను జైల్లో పెడతా మన్న కిషన్ రెడ్డి.. కాళేశ్వరం కేసును బీజేపీ ఎందుకు ముందుకు సాగనీయడం లేదు.. సీబీఐ విచారణ చేయాలని కోరినా ఇప్పుడు ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. కేసీఆర్, హరీష్ రావును ఎప్పుడు అరెస్ట్ చేస్తారో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దొందు దొందే ..నిజామాబాద్ జిల్లాలో బీజేపీ, బీఆర్ ఎస్ లను గెలిపిస్తే అభివృద్ది శూన్యం అన్నారు. బీజేపీనుంచి ఇద్దరు కేంద్ర మంత్రులన్నా.. నిధులు తెచ్చింది నిల్ అన్నారు. నిజామాబాద్ లో రెండుసార్లు బీఆర్ ఎస్ గెలిచినా మురికికూపం చేశారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. అర్వింద్ ను ఎంపీగా గెలిపిస్తే నిజామాబాద్ ను స్మార్ట్ సిటీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్రెడ్డి.
►ALSO READ | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 75 శాతం పైగా స్థానాలు గెలుస్తాం: మంత్రి దామోదర రాజ నర్సింహా..
నిజామాబాద్ జిల్లా అభివృద్దే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలవాలంటే కాంగ్రెస్ ను గెలిపించుకోవాలన్నారు. అభివృద్దే లక్ష్యంగా నిజామాబాద్ జిల్లాలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశాం.. ఒక కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీలలోవెయ్యి కోట్లతో అభివృద్ది పనులు చేస్తున్నామన్నారు సీఎం రేంత్ రెడ్డి.రూ.600కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్నిర్మిస్తున్నామన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి 100 శాతం సహకరిస్తా..నిధులిచ్చే బాధ్యత నాది.. నిజామాబాద్ ను అభివృద్ది చేసే బాధ్యత నాది అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
