తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 75 శాతానికి పైగా స్థానాలు గెలుస్తుందని అన్నారు.
ప్రచారంలో అమ్మా.. బాగున్నారా.. మా పాలన ఎలా ఉంది.. పథకాలు అందుతున్నాయా.. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. అంటూ... ఓటర్లను పలకరించారు మంత్రి దామోదర రాజనర్సింహ.
►ALSO READ | బీఆర్ఎస్ హయాంలో సింగరేణి నిధులు సిరిసిల్ల, సిద్దిపేటకు తరలించారు : మంత్రి వివేక్ వెంకటస్వామి
14వ వార్డు అభ్యర్థి అందెమోహన్ తరపున ఇంటింటి ప్రచారానికి వచ్చిన ఆయన స్థానిక భవాని మాత ఆలయం దగ్గర రచ్చబండ ఏర్పాటు చేసి మహిళలతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పలువీధుల్లో తిరిగి కాంగ్రెస్ పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.
తమ అభ్యర్థి అందెమోహన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు దామోదర రాజనర్సింహ. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో 75శాతానికి పైగా గెలుస్తుందని అన్నారు. తమ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తుందన్నారు. సీఎం పని తీరుతో ప్రజలు సంతృప్తి గా ఉన్నారని అన్నారు రాజనర్సింహ.
