మేడారం హుండీల లెక్కింపు రెండో రోజు పూర్తయ్యింది. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో భారీ భద్రత మధ్య జరుగుతున్న హుండీల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా శుక్రవారం ( ఫిబ్రవరి 6 ) రెండో రోజు 285 హుండీలను లెక్కించినట్లు తెలిపారు అధికారులు. ఇప్పటి దాకా 285 హుండీలను లెక్కించగా.. రూ. 6 కోట్ల 4 లక్షల 43 వేల 636 ఆదాయం వచ్చినట్లు తెలిపారు అధికారులు. మొత్తం 828 హుండీలకు గాను ఇవాళ్టికి 285 హుండీల కౌంటింగ్ పూర్తయినట్లు తెలిపారు అధికారులు.
హుండీల ద్వారా లభ్యమైన ఆదాయం ఎప్పటికప్పుడు బ్యాంక్ లో జమ చేస్తున్నట్లు తెలిపారు దేవాదాయశాఖ అధికారులు. గురువారం ( ఫిబ్రవరి 5 ) దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన హుండీల కౌంటింగ్ భారీ భద్రత మధ్య కొనసాగుతోంది. 200 మంది అధికారులు, 300 మంది వాలంటీర్లతో భారీ భద్రత మధ్య కౌంటింగ్ ప్రక్రియ సాగుతోంది. ఈ కార్యక్రమంలో మొదటి రోజు మంత్రి కొండా సురేఖ సహా ఆదివాసి పూజారులు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సునీత, ఇతర అధికారులు పాల్గొన్నారు.
►ALSO READ | కేసీఆర్ కు కిషన్ రెడ్డి దత్తపుత్రుడు: సీఎం రేవంత్ రెడ్డి
గత ఏడాది జాతర కంటే ఈ ఏడాది 288 అదనపు హుండీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు. మేడారం జాతరలో 828 హుండీలలో భక్తులు వేసిన కానుకలను లెక్కిస్తున్నారు అధికారులు. బెల్లం..కొబ్బరి నీళ్లతో కరెన్సీ తడిచిపోయిన క్రమంలో వాటిని లెక్కించడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.కౌంటింగ్ ఏరియాలో 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌంటింగ్ జరుగుతోంది.
