కరోనా రికవరీస్‌లో ఢిల్లీ టాప్‌.. ఐదో ప్లేస్‌లో తెలంగాణ

కరోనా రికవరీస్‌లో ఢిల్లీ టాప్‌.. ఐదో ప్లేస్‌లో తెలంగాణ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా రికవరీ రేట్‌ గణనీయంగా పెరుగుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలోని 16 రాష్ట్రాల రికవరీ రేట్ నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువగా నమోదైంది. ఈ వివరాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా రికవరీ రేట్ 64%గా ఉందని తెలిపింది.

‘గత వారంలో ప్రతి రోజూ 34 వేలకు పైగా రికవరీలు నమోదయ్యాయి. రికవరీ రేట్ శుభసూచకంగా చెప్పొచ్చు. ఇది ఏప్రిల్‌లో 7.85%గా ఉండగా.. ఈరోజు 64.4%గా ఉంది. ’ అని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్ గురువారం చెప్పారు. ఢిల్లీలో రికవరీ రేటు 88%గా ఉండగా, లడఖ్‌లో 80%, హరియాణాలో 78%, అస్సాంలో 76%, తెలంగాణలో 74%, గుజరాత్‌లో 73%, రాజస్థాన్‌లో 70%, మధ్యప్రదేశ్‌లో 69%, గోవాలో 68 శాతంగా ఉంది. ఇవాళ్టికి రికవరీలు 10.20 లక్షలుగా ఉంది. ఈ ఫలితాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కట్టడి చర్యలను సూచిస్తున్నాయి. దేశంలో కరోనా నుంచి 1 మిలియన్‌ పైగా ప్రజలు కోలుకున్నారు. డాక్టర్‌‌లు, నర్సులు, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌ అహర్నిషలు శ్రమిస్తుండటంతో ఇది సాధ్యమైంది. రష్యా (1.6%) తర్వాత ఇండియా సీఎఫ్‌ఆర్ చాలా తక్కువగా ఉంది’ అని భూషణ్ పేర్కొన్నారు.