జాబ్‌‌ ఇంటర్వ్యూల్లో  నకిలీగాళ్లు!

జాబ్‌‌ ఇంటర్వ్యూల్లో  నకిలీగాళ్లు!
  • కలసి వస్తున్న ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఇంటర్వ్యూలు
  • పెరుగుతున్న నకిలీ రెజ్యుమేలు

జాబ్స్ కోసం నకిలీ కేండిడేట్లను ఇంటర్వ్యూలకు పంపడం నానాటికీ పెరుగుతోంది. కార్పొరేట్లకు ఇది పెద్ద సమస్యగా మారింది. కొందరు వీడియో మార్ఫింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆడియో ప్రాక్సీ టూల్స్‌‌‌‌‌‌‌‌ వంటి టెక్నాలజీలు వాడుతున్నారు. బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ చెకింగ్స్‌‌‌‌‌‌‌‌ను తప్పించుకోవడానికి కూడా టెక్నాలజీలను ఉపయోగించుకుంటున్నారు.

బిజినెస్​ డెస్క్​, వెలుగు: బెంగళూరులోని ఒక ఐటీ కంపెనీ ఇటీవలే ఒక కోడర్‌‌‌‌‌‌‌‌ను మంచి జీతం ఇచ్చి తీసుకుంది. తీరా చూస్తే ఆయనకు కనీసం వీడియో కాల్స్‌‌‌‌‌‌‌‌ చేయడం రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక  బాసులు తలలు పట్టుకుంటున్నారు. ఇంటర్వ్యూ టైములో ఆయన అన్నింటికీ బాగానే జవాబులు చెప్పాడు. ఇంట్లో నుంచి కూడా బాగానే పనిచేశాడు. తీరా ఆఫీసుకు వచ్చి చూస్తే ఆయనకు బేసిక్స్‌‌‌‌‌‌‌‌ కూడా తెలియని పరిస్థితి. దీంతో కంపెనీ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇంటర్వ్యూ టైములోనే కేండిడేట్‌‌‌‌‌‌‌‌ స్క్రీన్‌‌‌‌‌‌‌‌షాట్‌‌‌‌‌‌‌‌ తీసుకోవాలని రిక్రూటర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇది ఒక్క బెంగళూరు కంపెనీ సమస్యే కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా నకిలీ కేండిడేట్లు ఇంటర్వ్యూలకు రావడం పెరుగుతూనే ఉంది. జాబ్‌‌‌‌‌‌‌‌ కోసం వీళ్లు చాలా వేషాలు వేస్తున్నారు. కొందరు వీడియో మార్ఫింగ్‌‌‌‌‌‌‌‌, ఆడియో ప్రాక్సీ టూల్స్‌‌‌‌‌‌‌‌ వంటి టెక్నాలజీలు వాడుతున్నారు. అంటే మంచి ట్యాలెంట్‌‌‌‌‌‌‌‌ ఉన్న వ్యక్తితో మారుపేరుతో ఇంటర్వ్యూతో చేయిస్తున్నారు. అపాయిమెంట్‌‌‌‌‌‌‌‌ లెటర్‌‌‌‌‌‌‌‌ మాత్రం మోసగాడికి దక్కుతోంది. వీళ్ల పనితీరు బాగాలేకపోవడం కంపెనీలకు తలనొప్పిగా మారుతోంది. క్లయింట్లకు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఐటీ కంపెనీలు చాలా మందిని ఒకేసారి ఇంటర్వ్యూ చేయడం వల్ల ఇటువంటి సమస్యలు వస్తున్నాయని ఫోరెన్సిక్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఇంటిగ్రిటీ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌కు చెందిర అర్పిందర్‌‌‌‌‌‌‌‌ సింగ్ అంటారు. కంపెనీల్లో రాజీనామాలు ఇందుకే పెరుగుతున్నాయని, గతంతో పోలిస్తే నకిలీ ఇంటర్వ్యూలు రెట్టింపు అయ్యాయని వివరించారు. టెక్‌‌‌‌‌‌‌‌, రిటైల్‌‌‌‌‌‌‌‌ సెక్టార్లలో విపరీతంగా జాబ్స్‌‌‌‌‌‌‌‌ ఉంటున్నాయి. దీంతో కంపెనీలు చాలా తక్కువ టైంలోనే ఇంటర్వ్యూలను ముగిస్తున్నాయి.

ఐడెంటిటీ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌

ఇంటర్వ్యూ సమయంలో అద్భుతంగా జవాబులు చెప్పి తరువాత చేతులెత్తేసే వారిని గుర్తించడానికి కంపెనీలు కూడా కొత్త టెక్నాలజీలను వాడుతున్నాయి. ఉదాహరణకు కేండిడేట్‌‌‌‌‌‌‌‌ ఐడింటిటీ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌ కోసం ఐడిఫై అనే యాప్‌‌‌‌‌‌‌‌ అందుబాటులోకి వచ్చింది. ఇంటర్వ్యూకు వచ్చిన కేండిడేట్‌‌‌‌‌‌‌‌.. జాయిన్ అయ్యే వ్యక్తి ఒక్కరేనా కాదా ? అని ఇది నిర్ధారించగలుగుతుంది. కంపెనీల్లో చేరుతున్న వాళ్లు అసలైన వాళ్లేనా కాదా ? అనే విషయమై ప్రతి ఒక్క హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్ మేనేజర్‌‌‌‌‌‌‌‌ టెన్షన్‌‌‌‌‌‌‌‌ పడుతున్నారని ఐడిఫై సీఈఓ అశోక్‌‌‌‌‌‌‌‌ హరిహరన్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ముఖ్యంగా పెద్ద కంపెనీల్లో ఇటువంటివి జరిగే అవకాశాలు ఎక్కువని అన్నారు. ‘‘ఇటీవల ఒక ఐటీ కంపెనీ ఒకర్ని తీసుకుంది.ఇంటర్వ్యూ చేసింది ఇప్పుడున్న మేనేజర్‌‌‌‌‌‌‌‌ కాదు. ఆయన కంపెనీలో చేరాక తగిన స్కిల్స్‌‌‌‌‌‌‌‌ లేవని కొత్త మేనేజర్‌‌‌‌‌‌‌‌కు అర్థమైంది. వెంటనే ఇంటర్వ్యూయర్‌‌‌‌‌‌‌‌తో మాట్లాడగా, అప్పుడు ఇంటర్వ్యూకు వచ్చిందని ఇతడు కాదని.. వేరే వ్యక్తని చెప్పాడు’’ అని వివరించారు. వేరే వాళ్లు ఇంటర్వ్యూకు రావడం ఒక సమస్య అయితే.. కొందరు తప్పుడు వివరాలతో రెజ్యూమేలు పంపుతున్నారు. బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో పట్టుబడకుండా స్కాములు చేస్తున్నారు. ఇందుకోసం బాట్స్‌‌‌‌‌‌‌‌, ఆర్టిఫిషియల్‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీలు వాడుతున్నారు. ఐడిఫై వంటి కంపెనీలు కూడా కొన్నిసార్లు నకిలీ కేండిడేట్లను గుర్తించలేకపోతున్నాయి. ఏటా ప్రతి కంపెనీలో 30 శాతం మంది వరకు ఇలాంటి నకిలీలను గుర్తించి ఇంటికి పంపుతున్నారని ఎంఫిల్టర్ అనే ఫ్రాడ్‌‌‌‌‌‌‌‌ డిటెక్షన్‌‌‌‌‌‌‌‌ కంపెనీ చీఫ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ ధీరజ్‌‌‌‌‌‌‌‌ గుప్తా చెప్పారు. ఇలాంటివి జరగకుండా, ఇంటర్వ్యూ ను పూర్తిగా రికార్డు చేస్తున్నామని వెల్లడించారు. కేండిడేట్‌‌‌‌‌‌‌‌ జాయిన్‌‌‌‌‌‌‌‌ అయిన వెంటనే మరోసారి ప్రశ్నలు అడిగి వెరిఫై చేస్తున్నామని చెప్పారు.