చేతిలో బీర్ బాటిల్..సిగరెట్ : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యువతి

చేతిలో బీర్ బాటిల్..సిగరెట్ : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యువతి

కేరళలో ఓ యువతి తీయించుకున్న ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ చేతిలో త్రిశూలం, సిగరెట్, శంఖం, పక్కనే వైన్ బాటిల్ దిగిన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.  దీనిపై నిర్వహాకులు మాట్లాడుతూ మహిళల స్వేచ్ఛ గురించి వర్ణిస్తూ ఈ ఫోటో షూట్ నిర్వహించినట్లు కేరళలోని అలూవాకి చెందిన ఫోటోగ్రాఫర్ డియా జాన్ తెలిపారు. ప్రతీ చోట మహిళలకు స్వేచ్ఛ ఇవ్వకూడదని అంటుంటారు. కాని వారికి స్వేచ్ఛ కావాలి. వారికి కలలు ఉన్నాయని జాన్ అన్నారు.    బోల్డ్  నుంచి బ్యూటీఫుల్ గా సదరు యువతి ఇచ్చిన  ఫోజులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటో షూట్లపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.  ఆమెను దేవి అని పిలవకండి ఎందుకంటే ఆమె నా దెయ్యం అంటూ రిప్లయి ఇస్తున్నారు. మరికొందరు నవరాత్రి సందర్భంగా దిగిన ఈ ఫోటోషూట్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కామెంట్లు చేయడంపై ఫోటో గ్రాఫర్ డియా జాన్ స్పందించారు. తాము మహిళల స్వేచ్ఛ గురించే ఫోటోలు తీశామని,ఏ మతాన్ని అవమానించలేదని స్పష్టం చేశారు.