షాపింగ్ కి మగాళ్లే బెటర్.. లేడీసైతే లేట్ చేస్తారు

షాపింగ్ కి మగాళ్లే బెటర్.. లేడీసైతే లేట్ చేస్తారు
  • ఒసాకా మేయర్ కామెంట్స్
  • సోషల్ మీడియాలో జనం ఫైర్

టోక్యో : ఆడవాళ్లు షాపింగ్​కి వెళితే అంత తొందరగా ముగించరని, అందువల్ల మగవాళ్లే పోయి సరుకులు తెచ్చుకోవటం బెటరని వెస్ట్​ జపాన్​లోని ఒసాకా సిటీ మేయర్ ఇచిరో మత్సుయి చేసిన కామెంట్స్​పై జనాలు ఫైరయ్యారు. ‘సోషల్ డిస్టెన్సింగ్ సరిగా అమలు కావాలంటే భార్యాభర్తలు జంటగా బయటకు వెళ్లొద్దు’ అన్నది మేయర్​ ఉద్దేశం. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ కంట్రోల్​కు సిటీ జనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సర్కారుకి సహకరించాలని ఇచిరో కోరారు. ఇన్ఫెక్షన్ ఎక్కువ మందికి సోకకుండా ఉండాలంటే షాపింగ్ మాల్స్​లోకి కస్టమర్ల ఎంట్రీని తగ్గించటానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న రిపోర్టర్ ప్రశ్నికు మేయర్ పైవిధంగా రియాక్ట్​ అయ్యారు.

పొలిటీషియన్లకు ఆడవాళ్లంటే చిన్న చూపు

జపాన్​లాంటి దేశంలో ఓ మేయర్ ఇలా మాట్లాడటం సరికాదని ఒక యూజర్ విమర్శించారు. పేరెంటింగ్, నర్సింగ్, ఇంట్లోని పనులను పొలిటీషియన్స్ పెద్దగా పట్టించుకోరనటానికి ఇచిరో కామెంట్సే ఎగ్జాంపుల్ అని మరో యూజర్ మండిపడ్డారు. భిన్న నేపథ్యాలు ఉన్నోళ్లు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరాన్ని ఈ కామెంట్స్ చూపుతున్నారని ఇంకొకాయన అన్నారు. ఒసాకాలో శుక్రవారం నాటికి దాదాపు 1,500 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. రాజధాని టోక్యో తర్వాత ఎక్కువ ఎఫెక్ట్ అయిన సిటీ ఇదే. దీంతో జపాన్ గవర్నమెంట్ మే 6 వరకు నేషన్ వైడ్ ఎమర్జెన్సీ విధించింది.

Osaka Mayor Ichiro Matsui