ఊర్మిల ఓ సాఫ్ట్ పార్న్ స్టార్.. కంగన కామెంట్స్

ఊర్మిల ఓ సాఫ్ట్ పార్న్ స్టార్.. కంగన కామెంట్స్

న్యూఢిల్లీ: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, మహారాష్ట్ర సర్కార్‌‌ మధ్య నెలకొన్న వివాదం ఇంకా ముగియలేదు. కంగన పీవోకే వ్యాఖ్యలపై బుధవారం కాంగ్రెస్ నేత ఊర్మిలా మతోండ్కర్ మండిపడింది. డ్రగ్స్‌‌కు మూలం తన సొంత రాష్ట్రమైన హిమాచల్ అని కంగనాకు తెలుసా?, మాదక ద్రవ్యాలపై పోరును ఆమె అక్కడి నుంచే ప్రారంభించాలని ఊర్మిలా చెప్పింది. తాజాగా ఈ కామెంట్స్‌‌‌పై కంగన ఫైర్ అయ్యింది. ఊర్మిలను సాఫ్ట్ పార్న్ స్టార్ అంటూ కంగన తీవ్రస్థాయిలో విమర్శించింది. తన పోరాటాన్ని ఆమె ఎగతాళి చేస్తోందని తెలిపింది. ‘ఊర్మిల పొలిటికల్ టిక్కెట్ సంపాదించినప్పుడు నేను టిక్కెట్ దక్కించుకోలేనా? ప్రతి ఒక్కరికీ టిక్కెట్ ఇస్తున్నారు. నా జీవితంతో ఆటలాడుకోవడం నాకు అవసరమా? నా ఇల్లేమైనా కూల్చారా?’ అని కంగన పేర్కొంది. ప్రతీకారం కోసం కాకుండా మనుగడకై పోరాడే తన స్వభావంతో యుద్ధం చేస్తానని తెలిపింది.