V6 News

 ఓవైసీ కోసమే కేసీఆర్‌ CAA ను వ్యతిరేకిస్తున్నారు: లక్ష్మణ్

 ఓవైసీ కోసమే కేసీఆర్‌ CAA ను వ్యతిరేకిస్తున్నారు: లక్ష్మణ్

MIM అధినేత అసదుద్దీన్‌ ఓవైసీతో ఫ్రెండ్ షిప్ కోసమే సీఎం కేసీఆర్‌ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA) వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేత లక్ష్మణ్. CAA ను అడ్డుకోవడమంటే పాకిస్తాన్ ముస్లింలకు మనదేశ పౌరసత్వం కోరడమేనన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పారన్నారు లక్ష్మణ్. మున్సిపల్ ఎన్నికల్లో భైంసాలో టీఆర్‌ఎస్‌ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందన్నారు. బీజేపీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ తీసుకుంటున్న నిర్ణయాలే బీజేపీకి పెద్ద బలమన్నారు.