V6 News

ఏం పాపం చేశాడని.. ఈ కుర్రాడిని కత్తితో పొడిచార్రా.. పాపిష్టి వెధవల్లారా..!

ఏం పాపం చేశాడని.. ఈ కుర్రాడిని కత్తితో పొడిచార్రా.. పాపిష్టి వెధవల్లారా..!

ఛత్రపతి సంభాజీ నగర్: మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ -నగరంలోని ఏపీఐ కార్నర్ ప్రాంతంలో దారుణం జరిగింది. రోడ్డు మీద బైక్ను ఆపిన యువకుడిని మొబైల్ దొంగల బ్యాచ్ టార్గెట్ చేసింది. ముగ్గురు టీనేజర్లు బైక్పై అతనికి కొంచెం దూరంలోకి వెళ్లి ఆగారు. వాళ్లలో ఒక టీనేజర్ ముందుగా సదరు యువకుడి దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడాడు. ఆ తర్వాత మిగిలిన ఇద్దరు టీనేజర్లు కూడా ఆ కుర్రాడి దగ్గరకు వచ్చారు.

ఈ ముగ్గురు టీనేజర్లలో ఒకరి దగ్గర కత్తి కూడా ఉంది. ఆ యువకుడిని బెదిరించి అతని స్మార్ట్ ఫోన్ లాక్కోవడానికి యత్నించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువకుడిపై ఈ ముగ్గురిలో ఒకడు కత్తితో దాడి చేశాడు. కత్తితో పలుమార్లు దాడి చేయడంతో సదరు యువకుడి కడుపులో కత్తి గుచ్చుకుని తీవ్రంగా గాయమైంది.

అతనిని పట్టించుకోకుండా కత్తితో దాడి చేసి అతని స్మార్ట్ ఫోన్ కొట్టేసి ముగ్గురు టీనేజర్లు అక్కడి నుంచి బైక్పై పారిపోయారు. కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన కరణ్ జాదవ్ అనే యువకుడు రోడ్డు మీద వెళుతున్న ఒక బైకర్ను ఆపాడు. అతని పరిస్థితి చూసి ఆగిన బైకర్ వెంటనే బాధితుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించాడు. కడుపులో కత్తి గుచ్చుకోవడంతో తీవ్రంగా గాయపడిన కరణ్ జాదవ్కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమాయకుడైన ఆ యువకుడిపై కత్తి దాడి చేసి అతని ప్రాణాలకే ముప్పు తెచ్చిన ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఇలాంటి వాళ్లను బతకనీయకూడదని మండిపడ్డారు. చదువుకోకుండా.. ఏ పనీ చేయకుండా.. ఇతరులపై దాడి చేసి పక్క వాళ్ల జీవితాలను నాశనం చేసే ఇలాంటి వాళ్లను ఉరి తీయాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేశారు.