వీడిన మిస్టరీ: ప్రేమ పెళ్లి చేసుకున్నాడనే..

వీడిన మిస్టరీ: ప్రేమ పెళ్లి చేసుకున్నాడనే..

హైదరాబాద్ : ప్రేమ పెళ్లి చేసుకోవడమే నారాయణ రెడ్డి హత్యకు కారణమని విచారణలో తేలిందన్నారు మదాపూర్ డీసీపీ శిల్పవల్లి. KPHBలో నివాసం ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నారాయణరెడ్డిని జూన్ 27న హత్య చేశారు. అయితే తన కూతురు రవళిని  ప్రేమించి పెళ్లి చేసుకోవడంతోనే నారాయణ రెడ్డి మామ వెంకటేశ్వర్ రెడ్డి హత్య  చేయించాడని పోలీసులు తెలిపారు. వెంకటేశ్వర్ రెడ్డి తనకు బంధువైన శ్రీనివాస్ రెడ్డితో కలిసి నారాయణ రెడ్డిని చంపేందుకు ప్లాన్ చేశాడన్నారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుకుందాం రమ్మంటూ నారాయణ రెడ్డిని కారులో ఎక్కించుకెళ్లారన్నారు డీసీపీ శిల్పవల్లి. ప్లాన్ ప్రకారం నారాయణరెడ్డి గొంతుకు ఉరి బిగించి హత్య చేశారన్నారు. తర్వాత జిన్నారం అడవుల్లోకి తీసుకెళ్లి శవాన్ని తగలబెట్టారన్నారు. హత్య తర్వాత అందరు కర్నూలు పారిపోయారని తెలిపారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులున్నారన్నారు డీసీపీ. వీరిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.