ఐసీసీ టీ20 బ్యాట్స్‌‌మెన్‌‌ ర్యాంక్ మెరుగుపరచుకున్న కోహ్లీ

ఐసీసీ టీ20 బ్యాట్స్‌‌మెన్‌‌ ర్యాంక్ మెరుగుపరచుకున్న కోహ్లీ
ఎనిమిది నుంచి ఏడుకు చేరుకున్న విరాట్‌‌ దుబాయ్‌‌: టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ ఐసీసీ టీ20 బ్యాట్స్‌‌మెన్‌‌ ర్యాంకింగ్స్‌‌లో ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ బుధవారం రిలీజ్‌‌ చేసిన ర్యాంకింగ్స్‌‌లో విరాట్‌‌ ఎనిమిది నుంచి ఏడో ప్లేస్​కు చేరగా.. లోకేశ్‌‌ రాహుల్‌‌ తన మూడో ర్యాంక్‌‌ నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్‌‌ యంగ్‌‌స్టర్‌‌ డేవిడ్‌‌ మలాన్‌‌(915 రేటింగ్‌‌ పాయింట్స్‌‌) నంబర్‌‌ వన్‌‌ ర్యాంక్‌‌లో ఉండగా, పాక్‌‌ క్రికెటర్‌‌ బాబర్‌‌ ఆజమ్‌‌(820), రాహుల్‌‌(816) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.  కోహ్లీ ఖాతాలో 697 పాయింట్లు ఉన్నాయి.  మూడు ఫార్మాట్లకు సంబంధించిన ఐసీసీ బ్యాట్స్‌‌మెన్‌‌ ర్యాంకింగ్స్‌‌లోనూ కోహ్లీ టాప్‌‌–10లోనే ఉండటం విశేషం. వన్డేల్లో టాప్‌‌ పొజిషన్‌‌లో ఉన్న అతను టెస్టుల్లో సెకండ్‌‌ ర్యాంక్‌‌లో కొనసాగుతున్నాడు.  కాగా, గాయం వల్ల ఆస్ట్రేలియా టూర్‌‌కు దూరమైన రోహిత్‌‌ శర్మ(623).. టీ20ల్లో 14వ ర్యాంక్‌‌లో నిలిచాడు. బౌలర్ల లిస్ట్​లో అఫ్గాన్‌‌ స్పిన్నర్‌‌ రషీద్‌‌ ఖాన్‌‌ టాప్‌‌ ప్లేస్‌‌లో ఉన్నాడు. టాప్​10లో ఇండియా నుంచి  ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. వాషింగ్టన్‌‌ సుందర్‌‌ 12వ ర్యాంక్‌‌లో ఉన్నాడు. ఆల్‌‌రౌండర్లలో మహ్మద్‌‌ నబీ (అఫ్గాన్‌‌) టాప్‌‌ ప్లేస్‌‌లో కొనసాగుతుండగా టాప్‌‌–20లో ఇండియా నుంచి ఒక్కరూ లేరు. టీమ్‌‌ ర్యాంకింగ్స్‌‌లో ఇంగ్లండ్‌‌, ఆస్ట్రేలియా, ఇండియా వరుసగా టాప్‌‌–3లో నిలిచాయి. For More News.. కరోనా టైంలోనూ విదేశీ పెట్టుబడులు ఆగలేదు లాక్‌డౌన్‌లో పానీ పూరికి 2 లక్షల ఆన్‌లైన్‌ ఆర్డర్లు అప్పిచ్చే యాప్స్‌తో జర జాగ్రత్త