కేసీఆర్ పై చంద్రబాబు విమర్శలు: కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

కేసీఆర్ పై చంద్రబాబు విమర్శలు: కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

ఎమ్మెల్సీ ఎన్నికలపై మీడియాతో చిట్ చాట్ చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 5 ఎమ్మెల్సీ స్థానాలు గెలుస్తామని చెప్పారు. తమకు 5 స్థానాలు గెలిచే సంఖ్యాబలం ఉందన్నారు. మార్చి 1 నుంచి పార్లమెంట్ సన్నాహక సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. 16 ఎంపీ స్థానాలు గెలిపించాలని ప్రజలను కోరుతామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీకి తగిన సీట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. 16 ఎంపీ సీట్లు గెలిస్తే ఢిల్లీని డిమాండ్ చేయవచ్చన్నారు. ఢిల్లీలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తామని చెప్పారు. ఇక క్యాబినెట్లో ఎవరుండాలనేది సీఎం కేసీఆర్ నిర్ణయమన్నారు… కేటీఆర్. తనతో పాటు హరీష్ ఇంకా చాలా మందికి పదవులు రాలేదని తెలిపారు.

ఏపీ సీఎం చంద్రబాబు కేసీఆర్ పై చేస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. చంద్రబాబు కలలో కూడా కేసీఆర్ ను కలవరిస్తున్నారని….వచ్చే ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు వందశాతం ఓడిపోతారని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గెలుస్తదని అనిపిస్తోందన్నారు. హైదరాబాద్ లో చంద్రబాబుకు కూడా ఆస్తులు ఉన్నాయని గుర్తు చేశారు. ఢిల్లీలో కాదు కదా.. వచ్చే ఎన్నికల్లో విజయవాడలో కూడా బాబు చక్రం తిప్పలేడన్నారు. దేశంలో అన్ని రాష్ర్టాల్లో ఐటీ దాడులు జరుగుతాయని…. ఒక్క చంద్రబాబుకే ఉలిక్కిపాటు ఎందుకన్నారు కేటీఆర్. చంద్రబాబులా మేం ఖాళీగా లేమని…. మాకు చాలా పని ఉందన్నారు. పశ్చిమబెంగాల్ లో జరిగిన పరిణామాలు మంచివి కావన్నారు. పుల్వామా ఘటనను రాజకీయంగా వాడుకుంటే ప్రజలు తిప్పికొడతారని చెప్పారు. కాంగ్రెస్ చెబుతున్నట్లు రాహుల్ వర్సెస్ మోదీ వాతావరణం ఉండదన్నారు కేటీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ నైరాశ్యంలో ఉందన్న ఆయన…. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదన్నారు.

చంద్రబాబుపై కేటీఆర్ కామెంట్స్ ను తప్పుబట్టారు ఏపీ మంత్రి లోకేశ్. టీడీపీ ఓటమి కోసం కేసీఆర్ ఆయన సహచరులకు భంగపాటు తప్పదు…. ఇది తథ్యమని ట్వీట్ చేశారు లోకేశ్. ఒక్కనాయకుడిని ఎదుర్కోలేక ముగ్గురు నాయకులు ఒక్కటై ఎన్నో కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమంలో పోటీ పడలేక, జగన్ తో చేతులు కలిపి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే భారీ ప్రణాళికలతో టీఆర్ఎస్ ముందుకొస్తున్న విషయం… కేటీఆర్ మాటల్లో తేలిపోయిందన్నారు లోకేశ్. ఫెడరల్ ఫ్రంట్ అంటూ చక్రం తిప్పి 420 పార్టీతో జతకట్టిన కేసీఆర్ తెలంగాణకే పరిమితమై చతికిలపడ్డారని ట్వీట్ లో వివరించారు. లోటస్ పాండ్ లో జగన్, కేటీఆర్ భేటీకి సంబంధించిన ఫోటోను ట్వీట్టర్లో పెట్టారు.