ఉద్యోగాల విషయంలో తప్పుడు లెక్కలతో మభ్యపెడుతున్న కేటీఆర్

ఉద్యోగాల విషయంలో తప్పుడు లెక్కలతో మభ్యపెడుతున్న కేటీఆర్

దేశంలో 43శాతం నిరుద్యోగం ఉంటే.. తెలంగాణలో 35 శాతం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. హైదరాబాద్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు భట్టి.  రాష్ట్రంలో 1.90లక్షల ఉద్యోగాలు ఉన్నాయని PRC కమిషన్‌ నివేదిక సమర్పించిందని తెలిపారు. అయితే ఉద్యోగాల కల్పన విషయంలో మంత్రి కేటీఆర్‌ తప్పుడు లెక్కలు చెబుతూ యువతను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

మరోవైపు అధికారంలోకి రాగానే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం.. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తోందని విమర్శించారు భట్టి. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగాలు వచ్చేవని.. ప్రైవేట్ పరం చేయడం ద్వారా SC,STలకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందన్నారు.