జనగామ అర్బన్: అక్రమ అబార్షన్ కేసులో ల్యాబ్ టెక్నీషియన్ అరెస్ట్

జనగామ అర్బన్: అక్రమ అబార్షన్ కేసులో ల్యాబ్ టెక్నీషియన్ అరెస్ట్

జనగామ అర్బన్, వెలుగు : అనుమతులు లేకుండా రహస్యంగా గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ గర్భస్రావాలు చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ వేముల ప్రవీణ్‌‌‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం జనగామ పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఇన్‌‌‌‌చార్జి ఏసీపీ భీమ్‌‌‌‌శర్మ వివరాలు వెల్లడించారు. హనుమకొండలో రహస్యంగా క్లినిక్ నిర్వహిస్తూ లింగ నిర్ధారణ పరీక్షలకు ఒక్కొక్కరి వద్ద రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల మేడ్చల్ జిల్లాకు చెందిన శ్రావణికి పరీక్ష నిర్వహించి గర్భస్రావం చేయడంతో ఆమె మృతి చెందిందని చెప్పారు. 

బాధితురాలి భర్త ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు జనగామ బైపాస్ వద్ద ప్రవీణ్‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రెండు అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్లు, కారు, రెండు ఫోన్లు, రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో ఐదు కేసులు ఉన్నాయని, ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఆర్‌‌‌‌ఎంపీలు, మధ్యవర్తులపై దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ తెలిపారు.