నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలి : జనగామ కలెక్టర్‌‌‌‌ సందీప్‌‌‌‌ కుమార్‌‌‌‌ ఝా

నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలి : జనగామ కలెక్టర్‌‌‌‌ సందీప్‌‌‌‌ కుమార్‌‌‌‌ ఝా

జనగామ, వెలుగు : వికసిత్‌‌‌‌ గ్రామ పంచాయతీలే లక్ష్యంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని జనగామ కలెక్టర్‌‌‌‌ సందీప్‌‌‌‌కుమార్‌‌‌‌ ఝా ఆదేశించారు. గ్రామాల అభివృద్ధిపై సర్పంచులు, కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జల సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. 

వీబీజీ–రామ్‌‌‌‌జీ పథకంలో 125 రోజుల పని కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బావులు, బోర్‌‌‌‌వెల్లు, సాగునీటి కాలువలు, స్ప్రింక్లర్‌‌‌‌, డ్రిప్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌, బోర్‌‌‌‌వెల్‌‌‌‌ వాటర్‌‌‌‌ ఆటోమేషన్‌‌‌‌ సెన్సర్లు వంటి పనులు చేపట్టాలని తెలిపారు. చెక్‌‌‌‌డ్యామ్‌‌‌‌లు, రీఛార్జ్‌‌‌‌ పిట్లు, చెరువుల పునరుద్ధరణ, అండర్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌ డైక్స్‌‌‌‌ వంటి నీటి సంరక్షణ నిర్మాణాలను విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్‌‌‌‌ సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌‌‌‌డీవో భాస్కర్‌‌‌‌, అడిషనల్​ డీఆర్‌‌‌‌డీవో సూరి, ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌వో భాస్కర్‌‌‌‌, డీఏవో అంబికా సోనీ, డీపీవో వెంకట్‌‌‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.