జయశంకర్ భూపాలపల్లి: సింగరేణి ఓసీల్లో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్

జయశంకర్ భూపాలపల్లి: సింగరేణి ఓసీల్లో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బుధవారం నుంచి జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓసీ-1, ఓసీ-2ల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రాత్రి షిఫ్టు నుంచి ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కేటీకే ఓసీ-1లో రోజుకు 4,500 టన్నులు, ఓసీ-2లోనూ 5,500 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓసీల్లోకి వరద చేరడంతో పనులు నిలిచిపోయాయి. 

దీంతో సింగరేణికి సుమారు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. సుమారు 750 మంది కార్మికులతోపాటు ట్రక్కులు, షవల్స్‌‌‌‌ కూడా పనులకు దూరమై డంపింగ్‌‌‌‌ యార్డులకే పరిమితమయ్యాయి. గనుల యార్డుల్లోకి చేరిన వరద నీటిని బయటకు పంపేందుకు చర్యలు వేగవంతం చేశారు. పరిస్థితులను చక్కదిద్దిన తర్వాత బొగ్గు ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.