మయన్మార్‌లో కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి

మయన్మార్‌లో కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి

మయన్మార్‌లో కొండచరియలు విరిగిపడడంతో 22 మంది చనిపోయారు. మయాన్మార్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ప్యార్ కోన్ గ్రామంలో కొండచరియలు విరిగిపడడంతో మట్టిలో 16 ఇళ్లు కూరుకు పోయాయి. దీంతో చాలా మంది చనిపోగా…అనే మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది  జేసీబీల సాయంతో కొండచరియల కింద ఉన్న 22 మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన 47 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 89 వేల మంది సహాయక కేంద్రాలలో తలదాచుకున్నారు. ఈ ఘటనలో కొన్ని కుటుంబాలే గల్లంతయ్యాయని స్థానిక ప్రజలు తెలిపారు.

మయన్మార్‌లోని మావ్లిమైన్ ప్రాంతంలో జాతీయ రహదారులపై 1.8 మీటర్ల వరకు బురద పేరకపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడుతోంది. లోతట్టు ప్రాంతాలలో బస్సు, రైల్వే సర్వీసులను రద్దు చేశారు అధికారులు.