పాజిటివ్ కేసుల కంటే రికవరీలే ఎక్కువ

పాజిటివ్ కేసుల కంటే రికవరీలే ఎక్కువ

దేశంలో కరోనా తీవ్రత తగ్గుతోందన్నారు కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్. 21 రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయన్నారు. 5 రాష్ట్రాల నుంచే 50శాతం మరణాలు నమోదవుతున్నాయన్నారు. వారంలో కోటి 30 లక్షల కరోనా టెస్టులు చేశామన్నారు లవ్ అగర్వాల్. 8 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులుంటే,  9 రాష్ట్రాల్లో 50 నుంచి లక్ష కేసులు.... 19 రాష్ట్రాల్లో 50వేల లోపే యాక్టివ్ కేసులున్నాయన్నారు.

ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులే చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నారు ICMR డీజీ బలరాం భార్గవ. అప్పుడే త్వరగా ఐసోలేట్ కావాడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇంట్లోనే కరోనా టెస్టులు చేసుకునే కిట్ ను ఓ కంపెనీ తయారు చేసిందన్నారు. మూడు రోజుల్లో హామ్ టెస్టింగ్ కిట్ మార్కెట్లో అందుబాటులో ఉంటుందన్నారు. మరో మూడు కంపెనీలు డెవలప్ చేసిన హోం టెస్టింగ్ కిట్లు వారంలోగా అందుబాటులోకి వస్తాయన్నారు.