LSG vs MI: ఐపీఎల్ నుంచి ముంబై ఔట్.. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే అదొక్కటే మార్గం

LSG vs MI: ఐపీఎల్ నుంచి ముంబై ఔట్.. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే అదొక్కటే మార్గం

ఐపీఎల్ సీజన్ 2024 లో ముంబై ఇండియన్స్ ప్రస్తానం దాదాపుగా ముగిసింది. ఆడిన 10 మ్యాచ్ ల్లో మూడే విజయాలు సాధించిన హార్దిక్ సేన ప్లే ఆఫ్ అవకాశాలను పోగొట్టుకుంది. నిన్న (ఏప్రిల్ 30) లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో చిత్తుగా ఓడిపోవడంతో ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది. చావో రేవో మ్యాచ్ లో లక్నో చేతిలో 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ముంబై ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయినా ఏదోమూల వారు ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశం ఉంది. 

ముంబై ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే..?

టోర్నీలో ఒక జట్టు 14 మ్యాచ్ లు చొప్పున ఆడుతుంది. ఒక జట్టు ప్లే ఆఫ్ కు అర్హత సాధించాలంటే కనీసం 8 మ్యాచ్ ల్లో విజయం సాధించడం తప్పనిసరి. ప్రస్తుతం ముంబై 10 మ్యాచ్ ల్లో మూడు విజయాలు సాధించింది. నిన్న లక్నో చేతిలో ఓడిపోవడంతో మిగిలిన 4 మ్యాచ్ ల్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఈ నాలుగు గెలిచినా ఇతర జట్ల మ్యాట్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.   ఐపీఎల్ లో అన్ని బలమైన జట్లే. ప్రతి మ్యాచ్ లో విజయం సాధించాలంటే శక్తికి మించిన పని. దీంతో ముంబై ప్లే ఆఫ్ కు చేరాలంటే అద్భుతం జరగాల్సిందే.

పాయింట్ల పట్టికలో టాప్ 3 లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ (16), కోల్ కతా నైట్ రైడర్స్ (12),లక్నో సూపర్ జయింట్స్ (12) మిగిలిన అన్ని మ్యాచ్ ల్లో గెలవడంతో పాటు ముంబై తమ తదుపరి నాలుగు మ్యాచ్ ల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. అప్పుడు మిగిలిన ఒక్క ప్లే ఆఫ్ స్థానం కోసం 7 జట్లు పోటీ పడతాయి. ముంబై తో ప్రతి జట్టుకు ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశం ఉంది. కనీసం 7 మ్యాచ్ ల్లో గెలిస్తే ఏదో మూల ఆశలు సజీవంగానే ఉంటాయి. మరి ముంబై మ్యాజిక్ చేస్తుందో లేదో చూడాలి.