బ్రేకింగ్ : ఎన్నికల పోలింగ్ సమయం పెంపు..

బ్రేకింగ్ : ఎన్నికల పోలింగ్ సమయం పెంపు..

ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు సీఈఓ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ప్రకటించారు. ఎండల తీవ్రత దృష్ట్యా రాజకీయ పార్టీల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నామని సీఈసీ వికాస్ రాజ్ తెలిపారు.

 ఇది వరకు పోలీంగ్ సమయం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని పొడించడంతో పౌరులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది.