
తమిళ వర్సటైల్ యంగ్ యాక్టర్ కథిర్, మలయాళ నటుడు చాకో నటించిన లేటెస్ట్ మూవీ మీషా (Meesha). ఎమ్సీ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఓటీటీలో దూసుకెళ్తుంది. జులై 31న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఈ క్రమంలోనే మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆడియన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎట్టకేలకు సెప్టెంబర్ 12 నుంచి ఆహా తమిళ్ ప్లాట్‌ఫామ్తో పాటుగా సన్‌నెక్స్ట్‌లో స్ట్రీమింగ్కి వచ్చింది. ప్రస్తుతం ఓటీటీలోసైతం ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది మీషా. డిఫరెంట్ టైటిల్తో వచ్చిన ఈ సినిమాను మిస్ అవ్వకుండా చూసేయండి. తెలుగులో మీషా అంటే.. మీసాలు అని అర్థం.
ఈ మూవీలో కథిర్ నటనకు విశేషమైన ప్రశంసలు లభించాయి. షైన్ టామ్ చాకోకి కథిర్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి. సౌండ్ డిజైన్, విజువల్స్, ఎమోషన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. నటుడు కథిర్ కి మొదటి మలయాళం మూవీ కావడం విశేషం. ఈ సినిమా తమిళంలోనూ రిలీజైంది. IMDBలో ఏకంగా 9.4 రేటింగ్ ఉండటం ఆసక్తి కలిగించే అంశం.
ఓ ఫారెస్ట్ గార్డ్ తన ఫ్రెండ్స్ను అడవిలో డిన్నర్కు పిలుస్తాడు. రీయునైట్ పేరుతో పిలిచినా.. అక్కడికి వెళ్లిన తర్వాత అతని అసలు ఎజెండా ఏంటో మెల్లగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఆ ఫ్రెండ్స్ మధ్య ఉన్న రిలేషన్ ఎలాంటి మలుపు తీసుకుంటుందన్నదే స్టోరీ. డైరెక్టర్ రాసుకున్న ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీకి, సెట్ చేసిన స్క్రీన్ ప్లే ఆడియన్స్ లో ఉత్కంఠ పెంచుతుంది.
Meesha vandhachu frands🤩🔥Neenga inum pakalaya?👀
— aha Tamil (@ahatamil) September 14, 2025
Watch #Meesha streaming now on @ahatamil pic.twitter.com/aHiU6bVx78
కథేంటంటే:
ఆనందు (హకీమ్ షా), మిథున్ (కథిర్) ఇద్దరు ప్రాణ స్నేహితులు. కానీ.. ఇద్దరు విభిన్న సామాజిక నేపథ్యాల నుంచి వచ్చినవాళ్లు. మిథున్ ఒక మత్స్యకార సమాజానికి చెందినవాడు. ఆనందు అగ్రహారంలో పెరుగుతాడు. ఆనందు ఇంటికి వెళ్లినప్పుడు మిథున్ కుల వివక్షకు గురవుతాడు. ఇద్దరూ స్థానిక రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ల నాయకుడు రేగు (జియో బేబీ) కోసం పనిచేస్తుంటారు. అయితే.. మిథున్ ఉంటున్న కాలనీలో ఒక కార్పొరేట్ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ప్రపోజల్ వస్తుంది.
అందుకు బుదులుగా అందరికీ ఉద్యోగం, ఇల్లు, డబ్బు ఇస్తామని హామీ ఇస్తారు. కానీ.. ఈ ఫ్యాక్టరీ కోసం 2 వేల మందిని వేరే చోటికి తరలించాల్సి ఉంటుంది. దాంతో మిథున్ ఆ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతుంటాడు. ఆనందు కూడా తన స్నేహితుడికి, అక్కడి ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటాడు. కానీ.. అక్కడివాళ్లు మాత్రం ఆనందుని నమ్మకుండా అనుమానంతో చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ.