ఎర్ర బంగారానికి రికార్డు స్థాయిలో ధర.. వరంగల్ జిల్లాలో క్వింటా@రూ.37 వేలు

ఎర్ర బంగారానికి రికార్డు స్థాయిలో ధర.. వరంగల్ జిల్లాలో  క్వింటా@రూ.37 వేలు
  • వండర్ హాట్ మిర్చికి ఫుల్ గిరాకీ
  • ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఇదే హయ్యెస్ట్
  • రోజురోజుకూ పెరుగుతున్న చిల్లీ రేట్స్

వరంగల్ సిటీ: మార్కెట్లో ఎండు మిర్చికి ఫుల్ గిరాకీ వస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రోజు రోజుకూ చిల్లీ రేట్లు పెరు గుతోంది. తాజాగా వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వండర్ హాట్ మిర్చి రికార్డ్ ధర పలికింది. 

జయశంకర్ జిల్లా పాలిమెల మండలం ఐలపల్లి గ్రామానికి చెందిన వినోద్ బుధవారం (ఫిబ్రవరి 04) ఉదయం 3 క్వింటాళ్ల వండర్ హాట్ మిర్చిని వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు తీసుకువచ్చారు. క్వింటాల్ 37 వేల 100 రూపాయలుగా నమోదు అయ్యింది. మొత్తం రెండు ఎకరాల్లో 25 క్వింటాళ్ల వరకు పండుతుందని రైతు వినోద్ తెలిపారు. ఇందుకుగాను సుమారు లక్షా యాభై వేలు ఖర్చు అవుతుందన్నారు.

 ఇదిలా ఉంటే ఈ సంవత్సరం అకాల వర్షంతో మిర్చి పంట దెబ్బ తిందని, ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ అధికారులు తెలిపారు. ఎర్ర బంగారానికి ఇంత ధర పలకడం గత నాలుగేండ్లలో మొట్టమొదటిసా రి అని పేర్కొన్నారు.